టాటా స్కై బంపర్ ఆఫర్!! తక్కువ ధరకు మెట్రో ప్యాక్‌లు

|

డిటిహెచ్ రంగంలో టాటా స్కై మన దేశంలోనే అగ్రశ్రేణి ప్రొవైడర్ గా అవతరించింది. DTH రంగంలో ఈ ఆపరేటర్ అగ్రస్థానానికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డారు మరియు చందాదారుల యొక్క కేంద్రీకృత కదలికలను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తు ఉంది. అలాగే వినియోగదారులను ఆకర్షించడానికి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్లు మరియు ఛానల్ ప్యాక్‌లను విడుదల చేస్తూ టాటా స్కై తన చందాదారులకు అద్భుతమైన సేవలను అందిస్తోంది.

టాటా స్కై పోర్ట్‌ఫోలియో
 

టాటా స్కై తన కస్టమర్‌లను ఎల్లప్పుడూ క్రొత్త వారి మాదిరిగానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు టాటా స్కై అందిస్తున్న ఛానల్ పోర్ట్‌ఫోలియోను నిశితంగా పరిశీలిస్తే ఇది చందాదారుల కోసం గొప్ప ప్యాక్‌లను అందిస్తున్నది. టాటా స్కై సిఫార్సు చేసిన ప్యాక్‌లు, లైట్ ప్యాక్‌లు మరియు బ్రాడ్‌కాస్టర్ ప్యాక్‌లు సాధారణంగా తెలిసిన ఛానల్ల సమూహంతో అందిస్తుంది.

ఛానెల్ ప్యాక్‌

టాటా స్కై యొక్క ఛానెల్ ప్యాక్‌ల మొత్తం జాబితాలో చందాదారులకు మెట్రో ప్యాక్‌లు ఉత్తమంగా ఉన్నాయి. ఈ ప్యాక్‌లు అన్ని కొన్ని ప్రత్యేకమైనవిగా మరియు కాస్త భిన్నంగా కూడా ఉంటాయి. ఈ ప్యాక్‌లు వివిధ ప్రాంతీయ భాషల్లో లభిస్తాయి మరియు ఇవి వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ప్రతిపాదనను కలిగి ఉంటాయి.

టాటా స్కై తమిళం మెట్రో ప్యాక్‌లు

టాటా స్కై తమిళం మెట్రో ప్యాక్‌లు

టాటా స్కై అందిస్తున్న మెట్రో ప్యాక్‌ల జాబితాలో మొదటిది రూ.198.25ల తమిళ మెట్రో ప్యాక్. ఇది Zee తమిళ్, స్టార్ విజయ్, సన్ లైఫ్ వంటి ముఖ్యమైన వాటితో పాటు మరిన్ని ఛానెల్‌లను అందిస్తుంది. ఈ ప్యాక్‌లోని మొత్తం ఛానెల్ సంఖ్య ఆరు ఇవన్నీ SD ఛానెల్‌లు. అదేవిధంగా తమిళ మెట్రో హెచ్‌డి పేరుతో మరొక హెచ్‌డి ప్యాక్ 208.87 రూపాయలకు లభిస్తుంది. ఇది Zee తమిళ్ హెచ్‌డి, స్టార్ విజయ్ హెచ్‌డితో సహా మరో 4 ఎస్‌డి ఛానెల్స్ మరియు 2 హెచ్‌డి ఛానెల్‌లను అందిస్తుంది.

జనాదరణ పొందిన ఛానెల్ ధరలను తగ్గించిన టాటా స్కై

టాటా స్కై తెలుగు మెట్రో ప్యాక్‌లు
 

టాటా స్కై తెలుగు మెట్రో ప్యాక్‌లు

టాటా స్కై అందిస్తున్న తెలుగు మెట్రో ప్లాన్ జాబితాలో రూ.199.02ల ప్లాన్ మొదటిది. ఇది 4SD ఛానెళ్లను అందిస్తుంది. ఇందులో ETV లైఫ్, జెమిని టివి, Zee తెలుగు మరియు డిస్కవరీ ఛానళ్ళు లబిస్తాయి. ఈ ప్యాక్ యొక్క HD వెర్షన్ కూడా ఉంది. కాకపోతే దీని ధర కూడా రూ.199.02 ఇందులో SD వేరియంట్లకు బదులుగా జెమిని టివి హెచ్డి మరియు Zee తెలుగు హెచ్డి ఛానల్స్ ఉంటాయి. ఇందులో గల మొత్తం ఛానెల్ సంఖ్య 4 మాత్రమే.

టాటా స్కై HD మల్టీ టీవీ కనెక్షన్ పై RS.400 తగ్గింపు

టాటా స్కై కన్నడ మెట్రో ప్యాక్‌లు

టాటా స్కై కన్నడ మెట్రో ప్యాక్‌లు

టాటా స్కై రూపొందించిన కన్నడ మెట్రో ప్యాక్ విషయానికి వస్తే ఇది రూ.198.25ల ధర వద్ద లభిస్తుంది. ఇది Zee కన్నడ, స్టార్ సువర్ణ, ఉదయ మ్యూజిక్ వంటి వాటితో సహా 8 SD ఛానెళ్లను అందిస్తుంది. కన్నడ మెట్రో హెచ్‌డి ప్యాక్‌ కూడా అదే ధర వద్ద లభిస్తుంది. కాకపోతే 8 ఛానెల్‌లను అందిస్తున్న మెట్రో ప్యాక్‌లలో Zee కన్నడ హెచ్‌డి ఛానెల్‌ను కలుపుతుంది.

టాటా స్కై మలయాళ మెట్రో ప్యాక్‌లు

టాటా స్కై మలయాళ మెట్రో ప్యాక్‌లు

టాటా స్కై యొక్క మలయాళ మెట్రో ప్యాక్‌ల విషయానికి వస్తే ఇది చందాదారుల కోసం రూ.190.07ల ధర వద్ద లభిస్తుంది. ఇందులో Zee కేరళం, ఆసియానెట్, సూర్య మ్యూజిక్, డిస్కవరీ ఛానెళ్లతో పాటు మరో 6 ఛానెళ్లను అందిస్తుంది. మలయాళం యొక్క హెచ్‌డి వెర్షన్ 207.39 రూపాయలకు లభిస్తుంది. ఇది మొత్తంగా 6 SD ఛానెల్‌లను మరియు 2 హెచ్‌డి ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులో జీ కేరళం హెచ్‌డి మరియు ఆసియానెట్ హెచ్‌డి ఉన్నాయి.

Fake Passport Website: పాస్‌పోర్ట్ నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త!!!

ప్రమోషనల్ ఆఫర్

ప్రమోషనల్ ఆఫర్

చందాదారులు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ ప్రణాళికలు పరిమిత సమయం ప్రమోషనల్ ఆఫర్ కింద లబిస్తాయి. అంటే ఈ ప్యాక్‌లు సాధారణ ధరతో పోల్చితే చందాదారులకు తక్కువ ధరకు పొందగలుగుతారు. ఉదాహరణకు తమిళ మెట్రో ప్యాక్ అసలు ధర రూ.198.25 కానీ ఇప్పుడు ఆఫర్లో భాగంగా ఇది రూ.194.71 వద్ద లభిస్తుంది. అదేవిధంగా వేర్వేరు మెట్రో ప్యాక్‌లు కూడా వాటి ధరల తగ్గుదలను కలిగి ఉన్నాయి. టాటా స్కై యొక్క ఇతర క్యూరేటెడ్ ప్యాక్‌లపై మరియు యాడ్-ఆన్ ప్యాక్‌లపై కూడా పరిమిత-కాలానికి తగ్గింపు ధరలను అందిస్తోంది. క్యూరేటెడ్ ప్యాక్‌లు 400 నుండి 600 రూపాయల ధరల శ్రేణిలో ఉండగా, యాడ్-ఆన్ ప్యాక్‌లు చాలా తక్కువ ధరతో కేవలం రూ.100 లోపు ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky's Metro Packs, For Regional Channels, Available With Price Cut

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X