Home
News

Tata Sky సెట్-టాప్-బాక్సుల పెరిగిన కొత్త ధరలు ఇవే...

ఇండియా యొక్క డిటిహెచ్ ఆపరేటర్లలో టాటా స్కై మార్చి 1 నుండి ట్రాయ్ యొక్క NTO 2.0 ను అమలు చేసింది. ఇందులో భాగంగా మొదటి మరియు రెండవ కనెక్షన్‌ల కోసం దాని నెట్‌వర్క్ సామర్థ్య రుసుమును తగ్గించింది. ముఖ్యంగా సెకండరీ కనెక్షన్ యొక్క ముందున్న NCF ధరలు రూ.130 మీద భారీగా రూ.52లకు తగ్గింపును అందించింది.

టాటా స్కై

టాటా స్కై

NCF ధరల తగ్గింపు చర్య టాటా స్కై యొక్క కస్టమర్ బేస్కు ప్రయోజనం చేకూర్చినప్పటికీ దాని లాభాల మీద మాత్రం తీవ్రరీతిలో ప్రభావాన్ని చూపుతుంది. అందుకోసం టాటా స్కై సంస్థ ఇప్పుడు కొత్త కనెక్షన్ల ధరలను మరియు SD మరియు HD సెట్-టాప్-బాక్సుల యొక్క ధరలను పెంచింది. కొత్తగా సవరించిన సెట్-టాప్-బాక్సుల యొక్క ధరల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

కొత్త ధరల వివరాలు

కొత్త ధరల వివరాలు

టాటా స్కై కొన్ని రోజుల ముందు అంతకుముందు రూ.1,399 ధర వద్ద తన కొత్త కనెక్షన్‌ల కోసం ఎస్‌డి, హెచ్‌డి సెట్-టాప్-బాక్సులను అందించింది. ఇప్పుడు డిటిహెచ్ ఆపరేటర్ వీటి మీద రూ.100లు పెంచి ప్రస్తుతం రూ.1,499 ధర వద్ద అందిస్తున్నది. అంటే సెట్-టాప్-బాక్సుల మీద 7.2 శాతం ధరను పెంచింది. మల్టీ-టివి కనెక్షన్లకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తిస్తుంది. ఇంతకుముందు సెకండరీ స్టాండర్డ్ డెఫినిషన్ (SD) కనెక్షన్ యొక్క ధర రూ.1,299 ఉండగా ఇప్పుడు దీని ధర రూ.1,399కు పెరిగింది. అలాగే సెకండరీ హై డెఫినిషన్ (హెచ్‌డి) కనెక్షన్ యొక్క ధర 999 రూపాయల నుండి ఇప్పుడు రూ.1,199 ధరకు పెరిగింది.

 

 

 

 

మిగిలిన ఆపరేటర్లు

మిగిలిన ఆపరేటర్లు

ప్రస్తుతం దేశంలో కొత్త కనెక్షన్లను ఎయిర్టెల్ డిజిటల్ టీవీ చౌకైన ధరల వద్ద అందిస్తోంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కొత్త కనెక్షన్ కోసం SD సెట్-టాప్-బాక్సు యొక్క ధర రూ.1,100 కాగా, హెచ్‌డీ STB ను రూ.1,300 ధర వద్ద అందిస్తున్నది. అలాగే డిష్ టివి కూడా తన కొత్త డిష్ NXT కనెక్షన్ కోసం రూ.1,490లను వసూలు చేస్తుంది. కొత్త డిష్‌ NXT హెచ్‌డి కనెక్షన్‌లను రూ.1,590 ధర వద్ద అందిస్తున్నది.

 

 

D2H & సన్ డైరెక్ట్

D2H & సన్ డైరెక్ట్

వీడియోకాన్ D2H తన కొత్త SD సెట్-టాప్-బాక్స్ కనెక్షన్‌ను ఇప్పుడు రూ.1,599 ధర వద్ద మరియు కొత్త HD సెట్-టాప్-బాక్స్ కనెక్షన్లను 1,799 రూపాయల ధర వద్ద అందిస్తున్నది. సన్ డైరెక్ట్ యొక్క కొత్త కనెక్షన్ల విషయానికి వస్తే ఇదే అత్యంత ఖరీదైనది. ఈ డిటిహెచ్ ఆపరేటర్ యొక్క SD సెట్-టాప్-బాక్స్‌కు రూ.1,799 ధర వద్ద మరియు హెచ్‌డి సెట్-టాప్-బాక్స్‌కు రూ.1,999 ధర వద్ద అందిస్తున్నది.

 

 

టాటా స్కై ఇటీవల ఇతర మార్పులు

టాటా స్కై ఇటీవల ఇతర మార్పులు

టాటా స్కై ఇటీవలే హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌లకు అనుకూలంగా తన స్టాండర్డ్-డెఫినిషన్ సెట్-టాప్ బాక్స్‌లను నిలిపివేసే ప్రధాన నిర్ణయం తీసుకుంది. ఎస్‌డి సెట్ల మాదిరిగానే హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌లను కంపెనీ అందించనుంది. టాటా స్కై యొక్క తక్కువ రీఛార్జ్ మొత్తాన్ని రూ.20 ను నిలిపివేసి దానిని ఇప్పుడు రూ.50 కి పెంచింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tata Sky Set-Top Box Price Hiked: Check New Prices Here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X