RS.100 కన్నా తక్కువ ధరతో స్మార్ట్ ఛానల్ ప్యాక్‌లను అందిస్తున్న టాటా స్కై
డిటిహెచ్ రంగంలో ఇండియాలో ప్రస్తుతం టాటా స్కై మొదటి స్థానంలో ఉంది. ప్రముఖ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన టాటా స్కై ఇప్పుడు రూ.100ల ధరల లోపు కొన్ని 'స్మార్ట్ ఛానల్' ప్యాక్‌లను తిరిగి ప్రవేశపెట్టింది.

ఈ ఎంపికలలో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్ ప్యాక్‌లు మరియు న్యూస్ కేటగిరీ నుండి కొన్ని SD ఛానెల్‌లను మాత్రమే అందిస్తుంది. వీటిలో ఎక్కువగా రూ.100 కంటే తక్కువ ధర కలిగిన ప్రాంతీయ ఛానల్ ప్యాక్‌లు ఉంటాయి. ఈ ప్యాక్‌లలో లభిస్తున్న అన్ని ఛానల్లు చందాదారులు చెల్లిస్తున్న డబ్బుకు మంచి విలువను కలిగి ఉంటాయి.

హిందీ స్మార్ట్ ఛానల్ ప్యాక్
100 రూపాయల కంటే ఎక్కువ ధరను కలిగిన ఏకైక స్మార్ట్ ఛానల్ ప్యాక్ "హిందీ స్మార్ట్ ఛానల్ ప్యాక్" మాత్రమే. ఇది మొత్తంగా 35 SD ఛానెళ్లను అందిస్తుంది. మరాఠీ స్మార్ట్ ప్యాక్ యొక్క ధర నెలకు రూ.52.16లుగా జాబితా చేయబడింది. ఈ ప్యాక్‌లో మొత్తంగా 9 SD ఛానెల్‌లను అందిస్తుంది. ఈ జాబితాలో కలర్స్ మరాఠీ, సోనీ మరాఠీ, జీ మరాఠీ మరియు Zee నుండి ఇతర మరాఠీ ఛానెల్స్ కూడా ఉన్నాయి.

తెలుగు స్మార్ట్ ఛానల్ ప్యాక్
టాటా స్కై చందాదారుల కోసం తెలుగు స్మార్ట్ ప్యాక్‌ను నెలకు రూ.96ల ధర వద్ద అందిస్తున్నది. ఈ ప్యాక్‌లో మొత్తంగా 10 ఛానల్ లను అందిస్తున్నది. ఈ జాబితాలో ఈటీవీ తెలుగు,జెమినీ మ్యూజిక్, స్టార్ మా,జీ తెలుగు,జెమినీ మూవీస్, స్టార్ మా మ్యూజిక్,ఖుషీ టీవీ,ఈటీవీ ఆంధ్రప్రదేశ్,ఈటీవీ తెలంగాణ వంటి ఛానల్స్ లభిస్తాయి.

ఓడియా స్మార్ట్ ప్యాక్
అదేవిధంగా టాటా స్కై చందాదారుల కోసం ఓడియా స్మార్ట్ ప్యాక్ ను కూడా అందిస్తోంది. ఈ ప్యాక్ నెలకు రూ.56.64 ధర వద్ద లభిస్తుంది. ఇది మొత్తంగా 20 ఛానెళ్లను అందిస్తుంది. ఈ జాబితాలో కలర్స్ ఒరియా, అలాంకర్, Zee ఒడిశా వంటి ఒడియా ఛానెల్‌లు ఉన్నాయి. ఇంకా బెంగాలీ, తెలుగు మరియు తమిళం వంటి ఇతర భాషలలో కూడా ఇలాంటి ఛానల్స్ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.

డిటిహెచ్ రంగంలో పోటీగా ఉండటానికి టాటా స్కై ఇటీవల తన సర్వీసులో ముఖ్యమైన 26 ప్రముఖ ఛానెళ్ల ధరను తగ్గించింది. డిష్ టీవీ వివిధ క్యూరేటెడ్, రీజినల్ మరియు మెట్రో ప్యాక్‌ల ధరలను తగ్గించిన తరువాత ఈ ధరల తగ్గింపు విధానాన్ని అమలుచేసింది.

డిస్కౌంట్‌తో లభించే ఛానెల్‌లు
డిస్కౌంట్‌తో లభించే ఛానెల్‌లలో జీ టీవీ, జీ మరాఠీ, జీ బంగ్లా, జీ సర్తక్, జీ కన్నడ, జీ తమిళం, జీ తెలుగు ఉన్నాయి. డిస్కౌంట్‌తో లభించే ఇతర ఛానెల్‌లు ఏషియానెట్, ఏషియానెట్ మూవీస్, నేషనల్ జియోగ్రాఫిక్, Nat జియో వరల్డ్, హంగమా టివి, SET, సోనీ సాబ్, కలర్స్, కలర్స్ కన్నడ మరియు సోనీ మాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు స్టార్ మా, స్టార్ జైషా, స్టార్ ప్లస్, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ విజయ్, విజయ్ సూపర్, స్టార్ స్పోర్ట్స్ 1 బంగ్లా, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ వంటి ఛానెళ్లపై కూడా డిస్కౌంట్ ను అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








