టాటా స్కైని నెలరోజుల పాటు ఉచితంగా పొందండి, గైడ్ మీ కోసం

|

టాటా స్కై సరికొత్తగా ముందుకు దూసుకుపోతోంది. యూజర్లకు బంపరాఫర్లను అందిస్తూ వస్తోంది. వేట్ డైరక్ట్ టు హోం (డీటీహెచ్) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా స్కై యూజర్ల కోసం మరో అదిరిపోయే ఆఫర్ ను అందిస్తోంది. యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ రూపంలో నెల రోజుల పాటు ఉచిత సేవలు అందిస్తోంది.

 టాటా స్కైని నెలరోజుల పాటు ఉచితంగా పొందండి, గైడ్ మీ కోసం

 

ఈ ప్లాన్ ప్రకారం మీరు 12 నెలలకు డబ్బులు ఒకసారి చెల్లిస్తే.. 1 నెల బిల్లు మొత్తాన్ని కంపెనీ మీ అకౌంట్‌లో ఉచితంగా జమ చేస్తుంది. ప్రాసెస్ ఎలాగో ఓ సారి చూద్దాం.

12 రెట్లు అధిక మొత్తాన్ని

12 రెట్లు అధిక మొత్తాన్ని

టాటా స్కై ఫ్లెక్సి యాన్వుల్ ప్లాన్ విషయానికి వస్తే యూజర్లు నెలవారీ బిల్లుకు 12 రెట్లు అధిక మొత్తాన్ని వారి అకౌంట్‌లో కలిగి ఉండాలి. అప్పుడు యూజర్లు ఈ ఫ్లెక్సి ప్లాన్ పొందొచ్చు. మీ నెలవారీ బిల్లు రూ.200 అనుకుంటే.. మీ అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అప్పుడు టాటా స్కై యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ సదుపాయాలు లభిస్తాయి.

 మీ అకౌంట్‌లో రూ.200

మీ అకౌంట్‌లో రూ.200

అలా కాకుండా మీరు మీ అకౌంట్‌లో రూ.2,400 బ్యాలెన్స్ కలిగి ఉంటే కంపెనీ మీ అకౌంట్‌లో రూ.200 జమచేస్తుంది. టాటా స్కై యూజర్లు వారి ప్లాన్లను ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా మార్చుకోవచ్చు. అయితే బ్యాలెన్స్ మాత్రం 12 నెలలకు పైనే ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మీరు మీ ప్లాన్‌ను సవరించేటప్పుడు నెలవారీ బిల్లు రూ.300 అయితే.. అప్పుడు మీ అకౌంట్‌లో రూ.3,600 ఉండేటా చూసుకోవాలి. అప్పుడే యాన్వుల్ ఫ్లెక్సి ప్లాన్ ప్రయోజనాలు లభిస్తాయి. బోనస్ అమౌంట్ ప్లాన్ చివరి రోజున అకౌంట్లో జమవుతుంది.

కొత్త స్మార్ట్ ప్లాన్లను
 

కొత్త స్మార్ట్ ప్లాన్లను

దిగ్గజ డైరెక్ట్- టు- హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై గత నెలలో ప్రాంతీయ భాషలకు సంబంధించి కొత్త స్మార్ట్ ప్లాన్లను లాంచ్ చేసింది. ఎఫ్‌టీఏ ఛానళ్లు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి. టాటా స్కై కొత్త స్మార్ట్ ప్యాక్స్ ధర రూ.206 నుంచి ప్రారంభమవుతోంది. మరాఠి ప్లాన్‌కు ఈ ధర వర్తిస్తుంది. హిందీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా, పంజాబీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా, గుజరాతీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా, బెంగాలీ స్మార్ట్ ప్లాన్ ధర రూ.220గా, ఒడిశా స్మార్ట్ ప్లాన్ ధర రూ.211గా ఉంది.

తెలుగు స్మార్ట్ ప్లాన్ ధర రూ.249

తెలుగు స్మార్ట్ ప్లాన్ ధర రూ.249

తెలుగు స్మార్ట్ ప్లాన్ ధర రూ.249గా ఉంది. తమిళ్, కన్నడ, మలయాళం స్మార్ట్ ప్లాన్స్ ధర కూడా రూ.249గా ఉంది. డీఆర్‌పీ, ఎన్‌సీఎఫ్, పన్నులు కలుపుకొని ఈ ధరల్లోనే కలిసి ఉన్నాయి.

మరోవైపు టాటా స్కై మిని ప్యాక్స్, యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా అందిస్తోంది. తెలుగు రీజినల్ ప్యాక్ ధర రూ.216గా, తెలుగు మిని హెచ్‌డీ ప్యాక్ ధర రూ.90గా ఉంది. టాటా స్కై అలాగే రెండు కొత్త బ్రాడ్‌క్యాస్టర్ ప్యాక్స్ కూడా లాంచ్ చేసింది.

టాటా స్కై లో చానెల్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా

టాటా స్కై లో చానెల్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా

టాటా స్కై లో చానెల్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో స్టెప్ బై స్టెప్ మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

టాటా స్కై అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ‘Click to Select బ్యానర్ ను సెలెక్ట్ చేయండి లేదా కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి https://packselection.tatasky.com/PRRedirect/PRWebMQ?_ga=2.153809009.853175044.1550505957-1668817277.1550505957 link

Recommended packs TataSky packs మరియు All channels అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి.అందులో మీకు కావలసింది ఎంచుకోండి. సబ్స్క్రైబర్ ID లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి. మీ ఫోన్ కు OTP వస్తుంది వెంటనే దానిని ఎంటర్ చేయండి.

ఇండివిజువల్ గా చానెల్స్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ‘All Channels' అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి .

ప్యాక్ మరియు చానెళ్లను ఎంచుకున్న తరువాత, వినియోగదారులు స్క్రీన్ పైభాగంలో గ్రాండ్ టోటల్ ను తనిఖీ చేయవచ్చు.

ఇప్పుడు, Submit & Proceed button పై క్లిక్ చేయండి.దీని తరువాత, పోర్టల్ చెల్లింపును అడుగుతుంది

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Subscribers Can Get One Month Free Service on Subscribing to Annual Flexi Plan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more