టాటా స్కై యూజర్లు రూ.200 ధర లోపు పొందే బెస్ట్ ఛానల్ ప్యాక్‌లు ఇవే...

|

ఇండియాలో ప్రస్తుతం అధిక మంది వినోదం కోసం టెలికాం సేవలను ఉపయోగిస్తూ ఉంటే ఇంటిలోని అందరూ ఒక చోట కూర్చొని సరదాగా గడపడం కోసం DTH సేవలను అధికంగా ఎంచుకుంటున్నారు. ఈ DTH సేవల విషయానికి వస్తే వినియోగదారులు టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, D2h వంటి ఇతర ప్రముఖ బ్రాండ్‌లను ఆశ్రయిస్తున్నారు. DTH ఆపరేటర్లలో సబ్‌స్క్రైబర్‌ల ఎంపికలో టాటా స్కై అనేది SD, HD మరియు OTT వంటి సెట్-టాప్ బాక్స్‌లు మరియు ఛానల్ బొకే వంటి ఎంపికలను వినియోగదారులకు ఎంచుకోవడానికి అనేక ప్యాక్‌లను అందిస్తుంది. అయినప్పటికీ వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఎంపికల సంఖ్య వారికి అవసరమైన సరైన ప్యాక్‌ను ఎంచుకోవడం కష్టతరం చేస్తుంది. అయితే రూ.200 లోపు ధర వద్ద సబ్‌స్క్రైబర్‌లు ఎంచుకునే టాటా స్కై ప్యాక్‌లను జాబితా గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

రూ.200 ధర లోపు లభించే టాటా స్కై ఛానల్ ప్యాక్‌లు

రూ.200 ధర లోపు లభించే టాటా స్కై ఛానల్ ప్యాక్‌లు

టాటా స్కై తమిళ్ మెట్రో HD ప్యాక్ ధర నెలకు కేవలం రూ.62.96 మాత్రమే. ఇది ఉత్తమ ఎంటర్ టైన్మెంట్ మరియు న్యూస్ ప్యాక్‌లలో ఒకటిగా ఉంది. ఈ ప్యాక్‌తో స్టార్ విజయ్ HD మరియు జీ తమిళ HD వంటి 2HD ఛానెల్‌లు మరియు ఆరు SD ఛానెల్‌లు లభిస్తాయి. టాటా స్కై నుండి మన దృష్టిని ఆకర్షించిన తదుపరి ప్యాక్ నెలకు రూ.75.76 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్యాక్‌ని బెంగాలీ లైట్ అని పిలుస్తారు. ఇందులో వినోదం, సినిమాలు, జ్ఞానం మరియు జీవనశైలి ఛానెల్‌లు ఉంటాయి. ఇది యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానెల్ మరియు మరిన్నింటితో సహా 11 SD ఛానెల్‌లను కలిగి ఉంది.

 హిందీ స్టార్టర్ ప్యాక్

టాటా స్కై హిందీ స్టార్టర్ ప్యాక్ రూ.103.32 ధర వద్ద లభిస్తుంది. ఇది హిందీ యొక్క ఉత్తమ వినోద ఛానెల్‌ల సేకరణతో వస్తుంది. ఈ ప్యాక్ లో NDTV ఇండియా, ఆజ్ తక్, కలర్స్, స్టార్ ప్లస్, కలర్స్ సినీప్లెక్స్ వంటి మరిన్నింటితో కలిపి 33 SD ఛానెల్‌లను కలిగి ఉన్నాయి. అలాగే మరొక హిందీ స్టార్టర్ HD ప్యాక్ నెలకు రూ.114.83 ధర వద్ద లభిస్తుంది. ఇది వినోదం కోసం 10 HD ఛానెల్‌లు మరియు 23 SD ఛానెల్‌ల సేకరణతో అందిస్తుంది.

 హిందీ లైట్ న్యూ ప్యాక్
 

టాటా స్కై యొక్క ఈ జాబితాలోని తదుపరి ప్యాక్ హిందీ స్మార్ట్ ప్యాక్. ఇందులో వినోదం, సినిమాలు మరియు న్యూస్ ఛానెల్‌లు ఉన్నాయి. ఇది నెలకు రూ.143.24 ధర వద్ద 38 SD ఛానెల్‌లతో వస్తుంది. టాటా స్కై నుండి రూ.193.34 ధర వద్ద లభించే ప్యాక్‌ని హిందీ లైట్ న్యూ ప్యాక్ కూడా ఎంటర్టైన్మెంట్, సినిమాలు, ప్రాంతీయ మరియు న్యూస్ ఛానెల్‌లతో సహా 69 SD ఛానెల్‌లతో వస్తుంది. చివరగా 76 SD ఛానెల్‌లను కలిగి ఉన్న హిందీ బేసిక్ ప్యాక్ వినియోగదారులకు నెలకు రూ.196.68 ధర వద్ద లభిస్తుంది.

టాటా స్కై తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తక్కువ ధరలో అందిస్తున్న రెండవ ప్లాన్‌ విషయానికి వస్తే 'తెలుగు ఫ్యామిలీ కిడ్స్ స్పోర్ట్స్ హెచ్‌డీ' ప్యాక్‌ను నెలకు రూ.441.96 ధర వద్ద అందిస్తున్నది. ఇది ఎక్కువగా మ్యూజిక్, గేమ్స్ , సినిమాలు, కిడ్స్ మరియు లైఫ్ స్టైల్ ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులో మొత్తంగా 31 హెచ్‌డి, 50 ఎస్‌డి ఛానెల్‌లు ఉన్నాయి. ఈ ప్యాక్‌లో తెలుగు ప్రాంతీయ ఛానెల్‌లు అధికంగా ఉన్నాయి.

టాటా స్కై తెలుగు బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

టాటా స్కై తెలుగు బేసిక్ HD ప్యాక్‌ వివరాలు

రూ.500 ధర లోపు టాటా స్కై అందించే ఛానల్ ప్యాక్‌ల జాబితాలో అతి తక్కువ ధరను కలిగి ఉండేది 'తెలుగు బేసిక్ హెచ్‌డి' ప్యాక్. ఇది తెలుగు ప్రాంతీయ ఛానెళ్లను అధికంగా కలిగి ఉంటుంది. వీటితో పాటుగా హిందీ సినిమాలు, వార్తలు మరియు ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌లు కూడా ఉన్నాయి. ప్రజలకు జ్ఞానం మరియు జీవనశైలి మార్గాలను అందించే ఛానెల్‌లు కూడా లభిస్తాయి. ఈ ఛానల్ ప్యాక్ యొక్క ధర నెలకు రూ.208.98. ఇది మొత్తంగా 15SD ఛానెళ్లతో పాటు 11HD ఛానెల్‌లను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Tata Sky Users Can Get Best Channel Packs For Less Than Rs.200

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X