Tata Sky vs Airtel Digital TV vs Dish TV vs D2h: తక్కువ ధర వద్ద లభించే STB లు ఇవే...

|

ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) రంగంలో చాలా మంది ఆపరేటర్లు ఉన్నారు. ప్రతి ఆపరేటర్ తన వినియోగదారులకు బడ్జెట్ దరలోను మరియు అధిక ధర వద్ద కూడా సెట్-టాప్ బాక్స్‌లను (STB) విక్రయిస్తున్నారు. డిటిహెచ్ విభాగంలో టాటా స్కై, డిష్ టివి, D2h, మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి వంటి కంపెనీలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ కంపెనీలన్నీ తన వినియోగదారులకు స్టాండర్డ్ డెఫినిషన్(SD) STB ల నుండి 4K మరియు Android STB ల వరకు ఎంచుకోవడానికి చాలా ఎంపికలు ఉన్నాయి. అయితే చౌకైన ధరలో లభించే సెట్-టాప్ బాక్స్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ డిజిటల్ టివి - SD సెట్-టాప్ బాక్స్ పూర్తి వివరాలు

ఎయిర్టెల్ డిజిటల్ టివి - SD సెట్-టాప్ బాక్స్ పూర్తి వివరాలు

ఎయిర్‌టెల్ డిజిటల్ టివి యొక్క SD సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1,100 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. డిటిహెచ్ మొత్తం మార్కెట్లో చౌకైన ధరలో లభించే STB లలో ఇది ఒకటి. ఇది USB ద్వారా రికార్డింగ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. ఇది SD సెట్-టాప్ బాక్స్ కాబట్టి మీకు లభించే సాటిలైట్ కంటెంట్ ఎక్కువ నాణ్యతను కలిగి ఉండదు. అధిక నాణ్యత గల కంటెంట్‌ కోసం HD సెట్-టాప్ బాక్స్ ను కొనుగోలు చేయవలసి ఉంటుంది. దీని ధర SD STB కంటే కేవలం రూ.200 మాత్రమే ఎక్కువ.

 

Also Read: Jio vs BSNL vs Airtel: 3GB రోజువారీ డేటా ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...Also Read: Jio vs BSNL vs Airtel: 3GB రోజువారీ డేటా ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే...

టాటా స్కై - SD మరియు HD సెట్-టాప్ బాక్స్ పూర్తి వివరాలు

టాటా స్కై - SD మరియు HD సెట్-టాప్ బాక్స్ పూర్తి వివరాలు

టాటా స్కై తన వినియోగదారులకు అందించే సమర్పణలలో STB కూడా చౌకైనదిగా పరిగణించబడదు. ఎందుకంటే టాటా స్కైకి చెందిన SD, HD STBల ధరలు 1,499 రూపాయలు. కానీ టాటా స్కై యొక్క SD మరియు HD ప్లాన్ లు ఖరీదైనవి కాబట్టి వీటిని చౌకైన వాటిలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ రెండు ఎస్‌టిబిల మధ్య గల వ్యత్యాసం విషయానికి వస్తే కంటెంట్‌ యొక్క నాణ్యత మరియు సౌండ్ నాణ్యత మాత్రమే.

డిష్ టీవీ - డిష్NXT సెట్-టాప్ బాక్స్ పూర్తి వివరాలు

డిష్ టీవీ - డిష్NXT సెట్-టాప్ బాక్స్ పూర్తి వివరాలు

డిష్ టివి వినియోగదారులు బడ్జెట్ ధరలో తక్కువ ధర వద్ద పొందగలిగే సెట్-టాప్ బాక్స్ లలో డిష్ఎన్ఎక్స్ టి STB ఒకటి. దీనిని వినియోగదారులు రూ.1,490 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఇందులో ఒక నెల చందాతో పాటుగా జీవితకాల వారంటీని అదనంగా ఉచితంగా అందిస్తుంది. అలాగే డిటిహెచ్ ఆపరేటర్ నుండి ఈ STBని కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు కూపన్ దునియా నుండి రూ.2,000 విలువైన ఉచిత కూపన్లను పొందుతారు.

D2h - డిజిటల్ SD సెట్-టాప్ బాక్స్

D2h - డిజిటల్ SD సెట్-టాప్ బాక్స్

డి 2 హెచ్ తన చౌకైన డిజిటల్ SD సెట్-టాప్ బాక్స్ ను రూ.1,499 ధర వద్ద అందిస్తుంది. క్రొత్త వినియోగదారులు దీనిని కొనుగోలు చేసిన వారికి 60 SD ఛానెళ్లను గల గోల్డ్ కాంబో యొక్క ఒక నెల సభ్యత్వంను ఉచితంగా అందిస్తుంది. అలాగే HD సెట్-టాప్ బాక్స్ కూడా ఖరీదైనది కాదు. దీనిని SD సెట్-టాప్ బాక్స్ కంటే కేవలం రూ.100 ఎక్కువకు రూ.1,599 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Tata Sky vs Airtel Digital TV vs Dish TV vs D2h: Lowest Price Set-Top Boxes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X