చరిత్ర పుటల్లోకి టాటా టెలికం, 5000 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..

Written By:

టాటా గ్రూప్‌ తన 21 ఏళ్ల ఫోన్‌ సర్వీసు వెంచర్‌ టాటా టెలిసర్వీసస్‌కు త్వరలోనే గుడ్‌బై చెప్పబోతుంది. టెలికం రంగంలో గడ్డు పరిస్థితుల నేపథ్యంలో టాటా టెలీ సర్వీసెస్‌ ప్రయాణం త్వరలోనే ముగిసిపోనున్నట్టు తెలుస్తోంది. దశలవారీగా కార్యకలాపాలను టాటా టెలీ సర్వీసెస్‌ మూసివేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కంపెనీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు చేసినట్టు సమాచారం. ఇదే జరిగితే 5000 ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయి.

Samsung Galaxy C9 Pro ధర మళ్లీ తగ్గింది బాసు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యాంకులకు రూ. 28,000 కోట్లకు పైగా చెల్లించాలనే వార్తలు..

బ్యాంకులకు టాటా టెలీ రూ. 28,000 కోట్లకు పైగా చెల్లించాలనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకని ఉన్న ఆస్తులను అమ్మేసి అప్పు తీర్చే దిశగా ఈ కంపెనీ ఆలోచిస్తుందని తెలుస్తోంది.

టెలికం విభాగం కోసం రూ.50,000 కోట్లు పెట్టుబడులు..

ఇప్పటి వరకు ఎన్నో ఏళ్లుగా టాటాలు టెలికం విభాగం కోసం రూ.50,000 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. టాటా గ్రూపు మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ లేఖ ఆధారంగా చూస్తే టాటా టెలీ సర్వీసెస్‌ను అర్ధంతరంగా మూసేస్తే గ్రూపునకు వాటిల్లే నష్టం రూ.32,000 కోట్లని అంచనా.

2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.4,517 కోట్ల నష్టాలు

2016-17 ఆర్థిక సంవత్సరంలో టాటా టెలీసర్వీసెస్‌ ఏకంగా రూ.4,517 కోట్ల నష్టాలను చవిచూసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టం రూ.2,023 కోట్లతో పోలిస్తే రెట్టింపైంది. టర్నోవర్‌ రూ.9,419 కోట్లుగా ఉంది. ప్రస్తుతం టెలికం మార్కెట్లో ఈ కంపెనీ వాటా 3.5 శాతంగా ఉంది.

తనకున్న స్పెక్ట్రమ్‌ను తిరిగి ప్రభుత్వానికి ..

ఈ పరిస్థితుల నేపథ్యంలో టాటా టెలి తనకున్న స్పెక్ట్రమ్‌ను తిరిగి ప్రభుత్వానికి ఇవ్వనున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని ద్వారా కంపెనీకి రూ.10,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అలాగే టవర్ల వ్యాపారం ఏటీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మిగిలి ఉన్న 32 శాతం వాటాను ఏటీసీకి విక్రయించడం వల్ల రూ.6,700 కోట్లు వచ్చే అవకాశం ఉంది.

1,25,000 కిలోమీటర్ల మేర ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌

అలాగే, కంపెనీకి దేశవ్యాప్తంగా 1,25,000 కిలోమీటర్ల మేర ఉన్న ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌ వర్క్‌ను విక్రయించినట్టయితే మరో రూ.5,000-7,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దాదాపు 5వేల మంది ఉద్యోగులకు ..

ఈ వైర్‌లెస్‌ సర్వీసులను మూసివేస్తున్న క్రమంలో టాటా సర్వీసెస్‌కు చెందిన ఉద్యోగులను టాటా గ్రూప్‌ ఇంటికి పంపేస్తోంది. ఈ మూసివేత ప్రక్రియలో భాగంగా దాదాపు 5వేల మంది ఉద్యోగులకు మూడు నుంచి ఆరు నెలల నోటీసు కూడా ఇస్తోంది.

ముందస్తుగా కంపెనీని వీడి వెళ్లాలనుకుంటారో..

ఎవరైతే ముందస్తుగా కంపెనీని వీడి వెళ్లాలనుకుంటారో వారికి సెవరెన్స్‌ ప్యాకేజస్‌ను కూడా కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. పెద్ద వారికి వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌(వీఆర్‌ఎస్‌)ను, కొంతమంది ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్‌ కంపెనీలకు టాటా గ్రూప్‌ బదిలీ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tata Teleservices Reportedly Shutting Down Operations In India Very Soon Read more News at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot