152 మంది ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ని టాటూల రూపంలో చేతి మీద...

Posted By: Staff

152 మంది ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ని టాటూల రూపంలో చేతి మీద...

పిచ్చి అనేది చాలా రకాలు. కొంత మందికి జంతువుల పిచ్చి, మరికొంత మందికి టాటూల పిచ్చి. ఒక గంట క్రితం యావత్ ఫేస్‌బుక్ జనాభా అంతా నవ్వుకున్న సంఘటన మీకు చెబుతాను. ఫేస్‌బుక్ లో ఉన్నటువంటి ఒక లేడి తన ఫ్రొపైల్ పిక్చర్స్‌‌లో తన ప్రెండ్స్‌గా ఉన్నటువంటి 152 మంది ఇమేజీలను తన చేతిపై టాటూల రూపంలో వేయించుకోని అందరిని ఆశ్చర్య పరచింది. ఈ విషయాన్ని డచ్ న్యూస్ పేపర్ అయినటువంటి టెలిగ్రాఫ్ బహిర్గతం చేసింది.

ఇంతకీ ఆమె చేతిమీద ఫేస్‌బుక్లో ఉన్నటువంటి 152 మంది స్నేహితులు ఇమేజిలను టాటూలుగా మరలిచినటువంటి టాటూ ఆర్టిస్ట్ పేరు డెక్స్ మోల్కర్. డెక్స్ మోల్కర్ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ ఈ టాటూని కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే వేయడం జరిగిందన్నారు. ఇది కేవలం నకిలీ టాటూ మాత్రమేనని అన్నారు. ఈ టాటూ కేవలం ఇమేజినరీ అని, ఇలాంటి టాటూ వల్ల మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదని వెల్లడించారు.

మనకు ఫేస్‌బుక్లో ప్రతిరోజుకి చాలా మంది ఫ్రెండ్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అలా ఫేస్‌బుక్‌లో ఉన్నటువంటి అందరిని కాకపోయిన మనకు కావాల్సిన కొంత మంది స్నేహితులను అయినా సరే ఇలా టాటూ రూపంలో వేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనే ఆలోచనలో నుండి వచ్చిందే ఈ రూపం అని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot