తక్షణమే పాన్‌కార్డు,ఆదాయపు పన్ను శాఖ పరిమిత కాల ఆఫర్‌,ప్రాసెస్ ఇదే !

|

ఆదాయపు పన్ను శాఖ తాజాగా పాన్ కార్డు లేని వారికోసం బంపరాఫర్‌ని తీసుకొచ్చింది. వ్యక్తిగత, వ్యాపార అవసరాల రీత్యా తక్షణం పాన్‌ కార్డ్‌లను పొందాలనుకునే వారికోసం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇన్‌స్టంట్‌ ఈ-పాన్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలిసారిగా పాన్‌ నంబర్‌ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులకు ఆధార్‌తో అనుసంధానమైన కేటాయింపు వ్యవస్థను ప్రారంభించింది. ఆధార్‌ కార్డులు ఉన్నవారెవరైనా సరే ఇన్‌స్టంట్‌ ఈ-పాన్‌ సేవలను పరిమితకాలం పాటు ఉచితంగా పొందొచ్చని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ ఆఫర్ ద్వారా మీరు ఎలక్ట్రానిక్‌ రూపంలో పాన్‌ను తక్షణమే పొందవచ్చు.ఈ సదుపాయాన్ని పరిమిత కాలమే అందిస్తున్నట్టు ఆదాయం పన్ను శాఖ తెలిపింది.

అత్యంత తక్కువ ధరకే 32 ఇంచ్ 4కె హెచ్‌డీ స్మార్ట్‌టీవీ

incometaxindiaefiling.gov.in
 

incometaxindiaefiling.gov.in

ముందుగా ఇ-పాన్‌ కోసం ఆదాయ పన్ను శాఖకు చెందినincometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ కావాల్సి ఉంటుంది.

పాన్‌ లేని వారు మాత్రమే..

పాన్‌ లేని వారు మాత్రమే..

ఇ-పాన్‌ కోసం దరఖాస్తు చేసే వారికి కచ్చితంగా ఆధార్‌ నెంబరు ఉండాలి. ఇప్పటికే పాన్‌ కలిగిన వారు ఇ-పాన్‌ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉండదు. పాన్‌ లేని వారు మాత్రమే ఇ-పాన్‌ కోసం దరఖాస్తు చేయవచ్చు.

ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ లింక్‌

ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ లింక్‌

ఆదాయ పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో ఎడమ వైపున్న ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ లింక్‌ను క్లిక్‌ చేయగానే ప్రత్యేక పేజీ ఓపెన్‌ అవుతుంది.ఇ-పాన్‌ కోసం ఏవేవి అవసరమన్న దానిపై ఈ పేజీలో సమాచారం ఉంటుంది.

ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ను క్లిక్‌ చేయగానే

ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ను క్లిక్‌ చేయగానే

కింది భాగంలో ఉండే అప్లయ్‌ ఇన్‌స్టంట్‌ ఇ-పాన్‌ను క్లిక్‌ చేయగానే దరఖాస్తుదారు పేరు, పుట్టిన తేదీ, ఆదార్‌ నెంబరును వెల్లడించాల్సిన పేజీ కనిపిస్తుంది. ఈ వివరాలు వెల్లడించిన తర్వాత సబ్మిట్‌ను క్లిక్‌ చేయగానే 15 అంకెల అక్నాలెడ్జ్‌మెంట్‌ నెంబరు వస్తుంది.

అక్నాలెడ్జ్‌మెంట్‌ నెంబరు ద్వారా
 

అక్నాలెడ్జ్‌మెంట్‌ నెంబరు ద్వారా

ఇది దరఖాస్తుదారు మొబైల్‌ నెంబరు/ఇమెయిల్‌కు వస్తుంది. అక్నాలెడ్జ్‌మెంట్‌ నెంబరు ద్వారా ఇ-పాన్‌ స్టేట్‌సను తెలుసుకోవడమేకాకుండా ఇ-పాన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

దేశంలోని వ్యక్తులు మాత్రమే

దేశంలోని వ్యక్తులు మాత్రమే

ఇ-పాన్‌ సదుపాయాన్ని దేశంలోని వ్యక్తులు మాత్రమే వినియోగించుకోవచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు ఈ సదుపాయాన్ని వినియోగించరాదు.

దరఖాస్తు చేసే వారు తమ ఆధార్‌ కార్డుకు..

దరఖాస్తు చేసే వారు తమ ఆధార్‌ కార్డుకు..

ఇ-పాన్‌ కోసం దరఖాస్తు చేసే వారు తమ ఆధార్‌ కార్డుకు అనుసంధానం చేసిన మొబైల్‌ నెంబర్‌ యాక్టివ్‌గా ఉన్నదీ లేనిదీ ముందే చూసుకోవాలి. దరఖాస్తు సమయంలో వన్‌టైమ్‌ పాస్‌ వర్డ్‌ (ఒటిపి) ఈ మొబైల్‌ నెంబరుకే వస్తుంది.

ఒటిపి నెంబరును ..

ఒటిపి నెంబరును ..

ఆధార్‌ ఇ-కెవైసి (నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియ ఒటిపి నెంబరును ఎంటర్‌ చేసిన తర్వాత పూర్తవుతుంది.ఆధార్‌ కార్డులో ఉన్న పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబరు, చిరునామా సరిగా లేని పక్షంలో ఇ-పాన్‌ను పొందడం సాధ్యంకాదు.

ఏమైనా లోపాలుంటే..

ఏమైనా లోపాలుంటే..

ఆధార్‌లో ఏమైనా లోపాలుంటే యుఐడిఎఐ వెబ్‌సైట్‌ ద్వారా మార్పులు చేర్పులు చేసుకుని ఇ-పాన్‌ కోసం దరఖాస్తు చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Allotment of free of cost instant e-PAN on near to real time basis More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X