విశాఖ వాసులకు ‘ఒలా’ టాక్సీ బుకింగ్ సేవలు

Posted By:

భారతదేశపు ప్రముఖ క్యాబ్, ఆటో, టాక్సీ బుకింగ్ మొబైల్ యాప్ ‘ఒలా' (ola) మార్కెట్ విస్తరణలో భాగంగా తమ సేవలను నూతనంగా విశాఖపట్నంలో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఒలా సంస్థ డైరెక్టర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్స్) ఆనంద్ సుబ్రమణ్యన్ మాట్లాడుతూ ప్రస్తుతానికి తమ యాప్ క్రింద 52 నగరాల్లో దాదాపు 60,000 కార్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 విశాఖ వాసులకు ‘ఒలా’ టాక్సీ బుకింగ్ సేవలు

పోర్ట్ సిటీలోని ప్రయాణీకులకు భద్రతతో కూడిన సౌకర్యవతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభూతులను చేరువచేసే లక్ష్యంతో ఒలా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు.

ప్రస్తుతానికి విశాఖపట్నంలో తమ యాప్ క్రింద 150 క్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని, మరో 6 నెలల వ్యవధిలో వీటి సంఖ్యను 400కు పెంచుతామని, ఏడాది చివరి నాటికి తమ ప్లాట్‌ఫామ్ క్రింద ప్రయాణ సేవలనందించే క్యాబ్‌ల సంఖ్యను 750కు విస్తరిస్తామని సుబ్రమణ్యన్ తెలిపారు. ఈ మొబైల్ బుకింగ్యాప్‌ను వినియోగించుకుని విశాఖ వాసులు తక్కువ సమయం ఇంకా తక్కువ ఖర్చుతో ప్రయాణాలను సాగించవచ్చు.

English summary
Taxi App firm Ola launches Services in Visakhapatnam. Read more in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting