లేటెస్ట్ టెక్నాలజీతో TCL iFFALCON Smart TVలు,ధరలు ఇవే !

iFFALCON Smart TV లాంచింగ్ తర్వాత ఇండియా స్మార్ట్ టీవీ మార్కెట్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేయబోతుందనే వార్తలు వస్తున్నాయి.

|

iFFALCON Smart TV లాంచింగ్ తర్వాత ఇండియా స్మార్ట్ టీవీ మార్కెట్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేయబోతుందనే వార్తలు వస్తున్నాయి. టీసీఎల్ కార్పోరేషన్ ఈ స్మార్ట్ టీవీలను లేటెస్ట్ టెక్నాలజీతో అలాగే హై క్వాలిటీ కెపాసిటీతో స్మార్ట్ వినియోగదారులను ఆకట్టుకోనున్నాయని తెలుస్తోంది. ఈ కొత్త టీవీలు ఫ్లిప్ కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. రానున్న ఈ కొత్త స్మార్ట్ టీవీలు మూడు వేరియంట్లలో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ఈ కంపెనీ నుంచి రానున్న ఉత్పత్తులు మంచి పనితీరును కనబరుస్తాయని ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్ భవిష్యత్ ను మార్చివేస్తాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కంపెనీ నుంచి రానున్న టీవీలు వివరాలు ఓ సారి పరిశీలించినట్లయితే iFFALCON 55K2A, iFFALCON 40F2 and iFFALCON 32F2 ఈ మూడు వేరియంట్లలో రానున్నాయి. ఈ మూడు వేరియంట్లలో ప్రధానంగా 55 ఇంచ్ టీవీ మీదనే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి దూసుకొస్తున్న TCL,ఆ టీవీలకు గట్టి పోటీస్మార్ట్‌టీవీ మార్కెట్లోకి దూసుకొస్తున్న TCL,ఆ టీవీలకు గట్టి పోటీ

Class-leading Manufacturing process

Class-leading Manufacturing process

TCL నుంచి రానున్న స్మార్ట్ టీవీల ప్రదాన ఉద్దేశం యూజర్లకు స్థిరమైన, మృదువైన, చూసేందుకు అనుకూలంగా ఉండేలా పెద్ద స్క్రీన్ మీద మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించడమేనని కంపెనీ చెబుతోంది. లెటెస్ట్ టెక్నాలజీతో పాటు మన్నికైన ఫీచర్లు అలాగే బడ్జెట్ ధరకు టీవీలను అందించే దిశగా కసరత్తులు చేస్తోంది. మంచి క్వాలిటీ టెక్నాలజీతో ఈ టీవీలన తయారుచేస్తోంది.

iFFALCON 55K2A: 4K UHD Google-certified Android TV with built-in HDR

iFFALCON 55K2A: 4K UHD Google-certified Android TV with built-in HDR

ఈ కంపెనీ నుంచి రానున్న టీవీలు ఆల్ట్రా హై డెఫినేషన్ పిక్చర్ క్వాలిటీని అందించనున్నాయి. 4K UHD TVలో crisp panelతో పాటు 3,840 x 2,160 pixels రిజల్యూషన్ తో రానుంది. HDR technologyని సపోర్ట్ చేస్తుంది. ఈ రకమైన టెక్నాలజీతో light and dark shadesలలో కూడా ఫిక్చర్ క్వాలిటీ మంచి పనితీరును అందిస్తుంది. యూజర్లు మంచి వ్యూయింగ్ అనుభూతిని పొందుతారు.

Exclusive Micro dimming technology
 

Exclusive Micro dimming technology

iFFALCON 55K2A టీవీ మైక్రో డ్రిమ్మింగ్ టెక్నాలజీతో మార్కెట్లోకి రానుంది. అలాగే విప్లవాత్మకమైన white LED HD backlightని ఇందులో నిక్షిప్తం చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా కలర్ కాంట్రెస్ట్ రకరకాలుగా యూజర్లకు కనిపిస్తుంది. పిక్చర్ లో ఉన్న రంగులను రియాలిటీ రూపంలో తనదైన శైలిలోకి మార్చుకుని యూజర్లకు మంచి అనుభూతిని అందిచేందుకు సాయపడుతుంది. అలాగే వీడియో ప్లే బ్యాక్ అనుభవం కూడా సరికొత్తగా ఆస్వాదించే అవకాశం కూడా ఉంది.

Experience Audio like never before

Experience Audio like never before

iFFALCON's flagship 55-inch TV సౌండు విషయంలో ఎటువంటి రాజీ లేకుండా దూసుకొస్తోంది. Dolby 5.1 సౌండుతో నాణ్యమైన DTS post-processing technologyతో వినియోగదారులను కట్టిపడేయనుంది. ఇతర కంపెనీలతో పోలిస్తే ఈ కంపెనీ నుంచి వచ్చే టీవీల్లో సౌండ్ ప్రముఖ పాత్రను పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త టెక్నాలజీ ఫీచర్ స్మార్ట్ వాల్యూంతో రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ ఆన్ ఆఫ్ సమయంలో ధ్వని విషయంలో ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా ఎప్పుడూ అదే సౌండుని ఆస్వాదించవచ్చు. sports, news, movies ఇతర వీడియోలను వీక్షిస్తున్నప్పుడు వాటికనుగుణంగా మీకు సౌండ్ అడ్జెస్ట్ మెంట్ చేసుకోవచ్చు.

Android 7.0 Nougat for seamless software approach

Android 7.0 Nougat for seamless software approach

ఈ టీవీలు ఆండ్రాయిడ్ 7.0 మీద రన్ కానున్నాయి. అలాగే పవర్ పుల్ గూగుల్ లేటెస్ట్ సాఫ్ట్ వేర్ తో రానున్నాయి. iFFALCON 55K2A టీవీ మల్టిపుల్ అడ్వాన్స్డ్ ఫీచర్లను అందించనుంది. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్లను పొందవచ్చు. గూగుల్ వాయిస్ సెర్చ్ ద్వారా మీరు మీ టీవీని కంట్రోల్ చేసే అవకాశం కూడా ఉంది. వాయిస్ ఇన్ పుట్ ద్వారా మీరు వాల్యూమ్ కంట్రోల్ , గూగుల్ యాప్స్ ఓపెన్ లాంటి పనులను చేయవచ్చు.

Powerful hardware

Powerful hardware

iFFALCON 55K2A టీవీ powerful quad-core CPU and dual-core GPUతో రానుంది. అలాగే ఈ టీవీ 2.56 GB RAM and 16 GB of internal storageతో పాటు స్పీడ్ , పవర్ పుల్ ప్రాసెసింగ్ బటన్లతో రానుంది. కేవలం రెండు సెకన్లలోనే మీరు ఆన్ చేసే అవకాశం ఉంది. 2.4 GHz+5GHz dual-band Wi-Fi. iFFALCONతో పాటు పవర్ సేవ్ చేసుకునే విధంగా టీవీ ఫీచర్లు ఉండనున్నాయి. డాల్బే సపోర్ట్ తో పాటు H.264/MPEG4/MKV/AVI/MP4 వీడియోలను సపోర్ట్ చేయనుంది.

Rich Content Library

Rich Content Library

ఈ కంపెనీ అడ్వాన్స్ 5జీ టెక్నాలజీ మీద భారీగానే పెట్టుబడులను పెడుతోంది. కాబట్టి కంపెనీ నుంచి వచ్చే ఫోన్లు 5జీని కూడా సపోర్ట్ చేసేవిధంగా రానున్నాయి. artificial intelligenceని కూడా అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఎంటర్ టైన్ మెంట్ లవర్స్ కోసం కంపెనీ ప్రముఖ దిగ్గజాలైన YouTube, Netflix, and Eros Nowలాంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి ద్వారా యూజర్లు అమకు నచ్చిన కంటెంట్ ని వీక్షించేందుకు అవకాశం కలగనుంది.కాగా 500 అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ టీవీ టెక్నాలజీ రూపుదిద్దుకోనుంది.

 Pricing and offers

Pricing and offers

ఈ స్మార్ టీవీలు మే 7 నుంచి అందుబాటులోకి రానున్నాయి. iFFALCON 55K2A ధర రూ. 45,999గానూ, iFFALCON 40F2 ధర రూ. 19,999గానూ, iFFALCON 32F2 రూ.13,999గానూ ఉండనున్నాయి. అలాగే జియోఫై డేటా కార్డు తో భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లతో మార్కెట్లోకి రానున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
TCL iFFALCON Smart TVs deliver class leading multimedia performance in affordable price-point More news at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X