Home
News

TCL నుంచి మూడు కొత్త టీవీలు లాంచ్! ధర రూ.15,000 లలోనే !

భారత స్మార్ట్ టీవీ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించేందుకు టీసీఎల్ కంపెనీ కొత్త సంకేతాలు ఇచ్చింది. టీసీఎల్ బడ్జెట్ శ్రేణిలో మూడు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వీటికి TCL S5400, TCL S5400A మరియు TCL S5403A స్మార్ట్ టీవీలు అని పేరు పెట్టారు. ఈ స్మార్ట్ టీవీలు బెజెల్-లెస్ డిజైన్, డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 24W స్పీకర్లను కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీల్లో 4K రిజల్యూషన్, క్వాంటం డాట్ మ్యాట్రిక్స్ టెక్నాలజీ ఉన్నాయి.

TCL Launches Industry First 32inch Bezel Less Smart Tvs , Price And Specifications Details.

అవును, TCL కంపెనీ భారతదేశంలో మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ లు 144Hz యొక్క సూపర్ హై రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయి. ఈ టీవీలు గేమింగ్‌కు అనుకూలమైనవిగా ఉంటాయి. అంతేకాకుండా, ఈ స్మార్ట్ టీవీలో ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్‌ఫేస్ ఉంటుంది. దీనితో పాటు, ఈ స్మార్ట్ టీవీలో ఇన్ బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది సంగీతం మరియు ఇతర యాప్ లను ఉపయోగించడానికి ఈ స్మార్ట్ టీవీ ని అనుమతిస్తుంది. అయితే ఈ స్మార్ట్ టీవీల ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

TCL S5400 స్మార్ట్ టీవీ ఫీచర్ల వివరాలు

TCL S5400 స్మార్ట్ టీవీ 32-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR 10ని సపోర్ట్ చేస్తుందని. సరికొత్త గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్‌తో ఈ స్మార్ట్ టీవీ వస్తుందని TCL కంపెనీ తెలిపింది. ఇది స్మార్ట్ టీవీ ల కోసం సెటప్ చేసిన అన్ని యాప్‌లకు యాక్సెస్ ఇస్తుంది. అంతేకాకుండా, ఈ స్మార్ట్ టీవీ గూగుల్ వాచ్‌లిస్ట్‌కు యాక్సెస్ ఇస్తుంది. అదనంగా, OTT అప్లికేషన్ల ద్వారా వీడియో స్ట్రీమింగ్ కు కూడా సాధ్యమవుతుంది.

TCL Launches Industry First 32inch Bezel Less Smart Tvs , Price And Specifications Details.

ఈ స్మార్ట్ టీవీ యొక్క మరోక ఉపయోగకరమైన ఫీచర్ ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్. ఇది ఏ పరికరం నుండి అయినా స్మార్ట్‌టీవీలో సంగీతం మరియు అప్లికేషన్‌లను ప్లే చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. అదనంగా, ఈ టీవీ గూగుల్ కిడ్స్ మోడ్‌కు కూడా మీకు యాక్సెస్‌ ను అందిస్తుంది. ఇది పిల్లల ఉపయోగం కోసం అనువైనదిగా, ఫిల్టర్ చేసిన కంటెంట్‌కు మాత్రమే యాక్సెస్‌ని అనుమతిస్తుంది.

TCL S5400A మరియు S5403A టీవీ ల డిజైన్ వివరాలు

ఈ స్మార్ట్ టీవీ లు 32-అంగుళాల HD డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11లో కూడా పనిచేతుంది. ఇది 7,000 యాప్‌లను మీకు అందించడానికి ఆప్షన్ ను కలిగి ఉంటుంది. అంటే మీరు ఈ స్మార్ట్ టీవీ లో ఒకే చోట 7,00,000 కంటే ఎక్కువ సినిమాలు మరియు షోలను పొందుతారు. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా టీవీ కంటెంట్ విశ్లేషణ ఆధారంగా స్క్రీన్ బ్రైట్‌నెస్ మరియు డార్క్‌నెస్ సెట్ చేసే మైక్రో-డిమ్మింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.

TCL Launches Industry First 32inch Bezel Less Smart Tvs , Price And Specifications Details.

TCL యొక్క ఈ కొత్త స్మార్ట్ టీవీల ధర వివరాలు

భారతదేశంలో కొత్తగా లాంచ్ అయిన ఈ TCL S5400 స్మార్ట్ టీవీ ధర రూ. 15,990 కి అందుబాటులో ఉంటుంది. అలాగే, TCL S5400A స్మార్ట్ టీవీ రూ.13,490 ధర కే అందుబాటులో ఉంటుంది. ఇంకా మరొక్క టీవీ మోడల్ అయిన TCL S5403A HD టీవీ రూ. 13,990 ధరకు మార్కెట్లో లభిస్తుంది. ఇందులో, TCL S5400 మరియు S5403A స్మార్ట్ టీవీల కొనుగోలుదారులకు 10% తక్షణ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు TCL బ్రాండ్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో.

Best Mobiles in India

English summary
TCL Launches Industry First 32inch Bezel Less Smart Tvs , Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X