స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి దూసుకొస్తున్న TCL,ఆ టీవీలకు గట్టి పోటీ

|

ఇండియా ఇప్పుడు స్మార్ట్ టీవీల దిశగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మోస్ట్ కటింగ్ ఎడ్జ్ ఉత్పత్తులు స్మార్ట్ టీవీ మార్కెట్లో ఇప్పుడు చాలా పాపులర్ అవుతున్నాయి. ఇందులో భాగంగా TCL Multimedia లేటెస్ట్ స్మార్ట్ టీవిలతో ఇండియా మార్కెట్లో పాగా వేయాలనుకుంటోంది. TCL కంపెనీ iFFALCON బ్రాండుతో greater than the rest అనే ట్యాగుతో సరికొత్తగా టీవీ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ నుంచి రానున్న టీవీ ఆండ్రాయిడ్ 7 ఆధారితంగా మంచి డిజైన్ తో ఇండియన్ యూజర్లకు ఆడియో వీడియో ద్వారా మంచి విజువల్ అనుభూతిని అందించేందుకు రెడీ అయింది. షియోమితో పాటు ధామ్సన్ ఇతర కంపెనీలకు ఈ టీవీలు గట్టిపోటినిచ్చే అవకాశం ఉంది.

 

మీ పాస్‌వర్డ్ ఎవరైనా దొంగిలించారో లేదో తెలుసుకోండిమీ పాస్‌వర్డ్ ఎవరైనా దొంగిలించారో లేదో తెలుసుకోండి

పెద్ద స్క్రీన్ మీద మంచి ఎంటర్ టైన్ మెంట్

పెద్ద స్క్రీన్ మీద మంచి ఎంటర్ టైన్ మెంట్

TCL నుంచి రానున్న స్మార్ట్ టీవీల ప్రదాన ఉద్దేశం యూజర్లకు స్థిరమైన, మృదువైన, చూసేందుకు అనుకూలంగా ఉండేలా పెద్ద స్క్రీన్ మీద మంచి ఎంటర్ టైన్ మెంట్ అందించడమేనని కంపెనీ చెబుతోంది. లెటెస్ట్ టెక్నాలజీతో పాటు మన్నికైన ఫీచర్లు అలాగే బడ్జెట్ ధరకు టీవీలను అందించే దిశగా కసరత్తులు చేస్తోంది.

 మూడు టాప్ బ్రాండ్లలో ఒకటైన TCL

మూడు టాప్ బ్రాండ్లలో ఒకటైన TCL

ప్రపంచంలోనే మూడు టాప్ బ్రాండ్లలో ఒకటైన TCL ఇండియాలో ఫ్లిప్ కార్ట్ సహకారంతో ఎక్స్ క్లూజివ్ గా స్మార్ట్ టీవీని లాంచ్ చేయబోతోంది. iFFALCON బ్రాండుతో ఈ టీవీలు రాబోతున్నాయి. టీవీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు బహిర్గతం చేసే అవకాశం ఉంది.

First 4K UHD Smart TV with Vivid View Technology
 

First 4K UHD Smart TV with Vivid View Technology

కొత్తగా రానున్న iFFALCON Smart TV బిగ్ స్క్రీన్ టీవీలకు సవాల్ విసరనుందని తెలుస్తోంది. కంపెనీ ఇండియా మార్కెట్లో పాగా వేసేందుకు ఈ టీవీని ఆవిష్కరించనుంది. Vivid View' technologyతో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విజువల్ అనుభూతిని ఈ కంపెనీ నుంచి రానున్న టీవీలు అందించనున్నాయి. better contrast ratio, better color reproduction and best-in-class viewing anglesతో ఫర్పెక్ట్ వ్యూని యూజర్లకు అందిచనుంది.

పార్టనర్స్

పార్టనర్స్

ఎంటర్ టైన్ మెంట్ లవర్స్ కోసం కంపెనీ ప్రముఖ దిగ్గజాలైన YouTube, Netflix, and Eros Nowలాంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వీటి ద్వారా యూజర్లు అమకు నచ్చిన కంటెంట్ ని వీక్షించేందుకు అవకాశం కలగనుంది.

ఆండ్రాయిడ్ 7

ఆండ్రాయిడ్ 7

CL iFFALCON smart TV ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టం మీద రన్ అవుతుంది. యూజర్లు తమ లివింగ్ రూంలో నాణ్యమైన సౌండుతో కూడిన అనుభూతిని పొందేలా ఈ టీవీలు ఉండనున్నాయి.

Diverse Product line-up

Diverse Product line-up

అయితే వీటి ధరలు ఎంతనేది ఇంకా బహిర్గతం కానప్పటికీ ఇతర టీవీల మాదిరిగానే కొంచెం అటు ఇటూగా ధరలు ఉండే అవకాశం ఉంది. 32-inch LED model, 42-inch model, UHD modelsను కంపెనీ ఆఫర్ చేయనుంది. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది.

 ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం

ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం

ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం ద్వారా ఈ కంపెనీ టీవీ మార్కెట్లోకి రానుంది. highly-customized, one-stop technological solution ధ్యేయంగా ఎంటర్ టైన్ మెంట్ రంగంలోకి రానుంది. ప్రధానంగా యువకులను బేస్ చేసుకుని ఈ టీవీని రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. 26వ తేదీన లాంచ్ కావాల్సినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎప్పుడు లాంచ్ అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
TCL plans to change smart TV ecosystem in India with the new iFFALCON TV range More news at Gizbot Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X