ప్రీమియం సెగ్మెంట్లో దుమ్మురేపుతున్న TCL X4 స్మార్ట్ టివి

|

ప్రీమియం స్మార్ట్ టీవీ సెగ్మెంట్లో మరో సంచలనం సృష్టించేందుకు TCL రెడీ అయింది. ఇందులో భాగంగానే తన లేటెస్ట్ స్మార్ట్ టీవి TCL X4 QLEDని మార్కెట్లోకి తీసుకు వచ్చింది. హైఎండ్ ఫీచర్లతో పాటు హైఎండ్ ధరతో ఈ స్మార్ట్ టివి వినియోగదారులను ఈ టివి కట్టిపడేస్తోంది. దాదాపు 65 ఇంచ్ UHD displayతో అదిరిపోయే ఇమేజ్ వ్యూయింగ్ అనుభూతిని అందించడంతో పాటు వినసొంపైన డీటీఎస్ టెక్నాలజీ ఆడియోని ఇందులో పొందుపరచి వినియోగదారులకు అందించేందుకు రెడీ అయింది. కాగా దీని ధర సుమారు రూ.

1,09,990గా ఉంది. ఈ రేంజ్ ధరలో ఇతర టీవీలు ఏవి మార్కెట్లో ఇటువంటి ఫీచర్లను అందించడం లేదని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ టీవి ద్వారా ఇతర కంపెనీలకు ప్రీమియం స్మార్ట్ టీవి సెగ్మెంట్లో భారీ సవాల్ విసరనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ టీవిలో ఉన్న టాప్ 5 ఫీచర్లను ఓ సారి పరిశీలిద్దాం.

పిక్చర్ క్వాలిటీ
 

పిక్చర్ క్వాలిటీ

ఈ టీవి 3840 x 2160px resolution Quantum Dot (QLED) displayతో వచ్చింది. ఈ రకమైన ఫీచర్ ద్వారా టీవీలోని చిత్రాలు IPS LCD panelకన్నా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. నలుపు రంగుతో పాటు ఇతర రంగులను ఈ ఫీచర్ కంట్రోల్ చేసి చిత్రానికి తగ్గట్లుగా మంచి బ్రైట్ నెస్ ని అందిస్తుంది. హై రిజల్యూషన్ మూవీస్ ని చూస్తున్నప్పుడు అదే క్వాలిటీతో కూడిన అనుభూతిని వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. MEMC 120Hz అనే కొత్త ఆల్గారిధమ్ ద్వారా మల్టీ మీడియాలో అదిరిపోయే అనుభూతిని ఈ టీవీ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక గేమింగ్ ప్రియుల కోసం కూడా ఇందులో కొన్ని ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది.

సౌండ్ క్వాలిటీ

సౌండ్ క్వాలిటీ

ఈ టీవీలో అదిరిపోయే సౌండ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. six speakersతో కూడిన సౌండ్ సిస్టంను ఇందులో ప్రవేశపెట్టారు. 40W sound output ద్వారా వినియోగదారులకు సినిమా ధియేటర్లోని అనుభూతిని కలిగించనుంది. ఈ టీవిలో Harmon/Kardon నుండి హైక్వాలిటీ స్పీకర్లను ఆఫర్ చేయనుంది. దీని ద్వారా హైవాల్యూం లెవల్స్ ని వినవచ్చు. Dolby Digital and DTS Premium సపోర్టు కూడా ఉండటంతో హై క్వాలిటీ సౌండును ఈ టీవి ఆఫర్ చేస్తోంది.

ఆండ్రాయిడ్ టీవీ

ఆండ్రాయిడ్ టీవీ

ఇప్పుడు వస్తున్న అన్ని రకాల టీవీలు ఆండ్రాయిడ్ ఓఎస్ ని ఆఫర్ చేస్తున్నాయి. TCL X4 QLED TV కూడా గూగుల్ సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ బేస్ డ్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్ ని అందిస్తోంది.4కె ,హెచ్ డి కంటెంట్ ని ఈ ఓఎస్ ద్వారా యూజర్లు వీక్షించవచ్చు. Netflix and Amazonలు అందించే ప్రీమియం స్ట్రీమింగ్ సర్వీసులు ఎటువంటి అంతరాయం లేకుండా వీక్షించే సౌలభ్యం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ ఆఫర్ చేసే అన్ని రకాల గేమ్స్ కూడా ఇందులో మీరు ఆడుకోవచ్చు.64-bit Quad-core chipset with 2.5 GB of RAMతో పాటు 16 GB of internal storageతో ఈ టీవీ వచ్చింది. దీంతో స్టోరేజ్ గురించి భయపడకుండా వినియోగదారులు అన్ని రకాల గేమ్స్ ని ప్లే చేసుకోవచ్చు.

డిజైన్
 

డిజైన్

TCL X4 QLED TV ప్రీమియం బెజిల్ లెస్ డిస్ ప్లేతో వచ్చింది. 7.9mm thicknessతో చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో పాటు యు ఆకారంలో స్డాండడ్ రావడం వల్ల చూసేందుకు మరింత లుక్ ని కలిగిస్తుంది. full metallic frame designతో దీన్ని తీర్చిదిద్దారు.

I/O and Overall Review

I/O and Overall Review

యుఎస్బి ఎ పోర్ట్ ద్వారా కీ బోర్డు, మౌస్, సెటప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లను పీసీకి అటాచ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఇది అమ్మకానికి రానుంది. టీసీఎల్ 65ఎక్స్4 ధర రూ.1,49,990 ఉండగా, దీన్ని పండుగ ఆఫర్ కింద అమెజాన్‌లో రూ.1,09,990కే విక్రయించారు. దీంతో పాటు 32, 40, 43, 49 ఇంచుల టీవీ మోడల్స్‌ను కూడా ఎస్6500 సిరీస్‌లో త్వరలో విడుదల చేయనున్నామని టీసీఎల్ వెల్లడించింది. వాటిల్లోనూ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందని, వాటి ధరలు వరుసగా రూ.16,990, రూ.24,990, రూ.27,990, రూ.31,990 ఉంటాయని ఆ కంపెనీ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
TCL X4 QLED TV: Sets a benchmark in the smart-television segment with these class leading features more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X