నాగ్‌పూర్‌లో టిసిఎస్ సాప్ట్‌వేర్ సెంటర్..

Posted By: Super

నాగ్‌పూర్‌లో టిసిఎస్ సాప్ట్‌వేర్ సెంటర్..

 

దేశంలో నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతున్న ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. లి కొత్తగా తన ఐటి సేవలను ఇప్పడు మహారాష్ట్రకు విస్తరించింది. సుమారు రూ 600 కోట్ల రూపాయలతో నాగ్‌పూర్‌లో కొత్తగా సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ క్యాంపస్‌కి సంబంధించిన మొదటి దశ పనులను ప్రారంభించింది. టిసిఎస్ నాగ్‌పూర్ క్యాంపస్ సిటి బయట ఉన్న మిహాన్ సెజ్‌‌లో సుమారు 54 ఎకరాలలో స్దాపించనున్నారు.

కంపెనీ విడుదల చేసిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృద్వీరాజ్ చౌహాన్ ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి హాజరై మొదటి పనులకు సంబంధించిన పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఈ సాప్ట్ వేర్ సెంటర్‌ని రెండు దశలలో పూర్తి చేస్తామని అన్నారు. మొదట దశలో సుమారు రూ 600 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్ ద్వారా సుమారు 16,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.

మొదటి దశలో ఈ సెంటర్‌లోకి ఇన్పర్మేషన్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సేవలకు సంబంధించి 8,200 మందికి ఉద్యోగాలు కల్పించనున్నామని టిసిఎస్ సిఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. రాబోయే కాలంలో నాగ్ పూర్‌ని కూడా పెద్ద ఐటి హాబ్‌గా డెవలప్ చేయనున్నట్లు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot