ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీస్‌లో మల్టీమిలియన్‌ డాలర్ల ఆర్డర్‌ కోట్టేసిన టీసీఎస్‌

Posted By: Super

ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీస్‌లో మల్టీమిలియన్‌ డాలర్ల ఆర్డర్‌ కోట్టేసిన టీసీఎస్‌

న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌కు డచ్‌ టెక్నికల్‌ కన్సెల్టెన్సీ సంస్థ రాయల్‌ హాస్‌కానింగ్‌ నుంచి మల్టీమిలియన్‌ డాలర్ల ఆర్డర్‌ లభించింది. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్‌ సర్వీసెస్‌ను టీసీఎస్‌ గ్లోబెల్‌ డెలివరీ సెంటర్స్‌ నెదర్లాండ్స్‌, హంగేరీ, ఇండియాలు వారికి సేవలందిస్తాయని టీసీఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వీసుల్లో భాగంగా మల్టీ లింగ్యువల్‌ సర్వీస్‌ డెస్క్‌, డేటా సెంటర్‌ హోస్టింగ్‌, మేనేజ్‌మెంట్‌, కంప్యూటింగ్‌ సర్వీస్‌, అప్లికేషన్‌ సపోర్టు సర్వీసెస్‌, ట్రాన్స్‌ఫార్మేషన్‌ సొల్యూషన్‌లు ఉంటాయని టీసీఎస్‌ తెలిపింది.

రాయల్‌ హాస్‌కానింగ్‌ వారి దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తమ వ్యాపారాలను విస్తరించుకోవాలనుకుంటోంది. ఈ సంస్థ 1881లో నెదర్లాండ్స్‌లో నెలకొల్పారు. 17 దేశాల్లో 57 కార్యాలయాల్లో 3,900 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot