ముంబై లైబ్రరీ.. టిసిఎస్ నిర్ణయం భేష్..

Posted By:

ముంబై  లైబ్రరీ.. టిసిఎస్ నిర్ణయం భేష్..

 

దేశంలో నెంబర్ వన్ స్దానంలో కొనసాగుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మంగళవారం ముంబై యూనివర్సిటీలో ఉన్న ఐకానిక్ రాజాభాయ్ క్లాక్ టవర్‌తో పాటు ముంబై యూనివర్సిటీ లైబ్రరీని ఇండియన్ హెరిటేజ్ సోసైటీతో కలసి పునరుద్దించనున్నామని తెలిపారు. ఈ సందర్బంలో టిసిఎస్ సిఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ముంబై యూనివర్సిటీది వంద సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. దక్షణ ముంబైలో ల్యాండ్ మార్క్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముంబై యూనివర్సిటీకి చెందిన రాజాభామ్ క్లాక్ టవర్, లైబ్రరీని ఇండియన్ హెరిటేజ్ సొసైటీతో కలసి కొత్త వైభవాన్ని తెచ్చేందుకు గాను సన్నాహాక చర్యలు చేపట్టామని అన్నారు.

ఇలా ఈరెండింటిని పునరుద్దించడం వల్ల వీటి పూర్వ వైభవం తిరిగి మరలా కొన్ని తరాలకు అందించినట్లు అవుతుందని అన్నారు. దేశంతో పాటు ముంబై సిటీ యొక్క విలువైన హెరిటేజిని ప్రపంచానికి దీని ద్వారా తెలుపుతామని గర్వంగా చెప్పారు. రాజాభాయ్ టవర్ వెనుక భాగాన ఉన్న లైబ్రరీ రీమోడలింగ్ ప్రాజెక్టు కోసం టాటా కన్సల్సెన్సీ సర్వీసెస్ సుమారుగా రూ 4.20 కోట్ల రూపాయాలను ఖర్చు చేయనుంది. ఈ లైబ్రరీని హైటెక్ లైబ్రరీగా రూపొదించడమే కాకుండా, ప్రపంచంలో అత్యంత విలువైన, ఎక్కడా లభించని పుస్తకాలను ఇందులో అమర్చాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

వంద సంవత్సరాల క్రితం ఈ రాజాభాయ్ క్లాక్ టవర్‌తో పాటు లైబ్రరీని బ్రిందా సౌమ్య నిర్మించారు. నిర్మాణంలో ఎక్కడైనా డామేజిలు, రాళ్లు పరిశుభ్రత లాంటి అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోనున్నారు.

 

 

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot