వెంకన్న ఆశీస్సుల కోసం టిసిఎస్, విప్రో పోటా పోటీ

Posted By: Super

వెంకన్న ఆశీస్సుల కోసం టిసిఎస్, విప్రో పోటా పోటీ

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్దానం ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తుల కోసం ప్రవేశపెడుతున్న శ్రీ సేవా ప్రాజెక్టు కోసం టిసిఎస్, విప్రో లతో పాటు మరో మూడు కంపెనీలు రేసులో ఉన్నాయి. వివారలలోకి వెళితే ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్దానం ప్రస్తుతానికి నాలుగు ఈ సర్వీసెస్‌లను అందిస్తుంది. అవి ఏమేమంటే ఈ సేవా, ఈ ఎకామ్డేషన్, ఈ సుదర్సనమ్, ఈ హుండి. ఇక రాబోయే కాలంలో భక్తలకు దేవుడుని మరింత దగ్గర చేరవేసిందుకుగాను కొత్తగా శ్రీ సేవా ప్రాజెక్టుని తిరుమల తిరుపతి దేవస్దానం చేపట్టింది. దీని వలన కొత్తగా భక్తలకు రూమ్స్‌, లడ్డూస్‌ని అందించడం వంటి సర్వీసెస్ రానున్నాయి.

ఈ శ్రీ సేవా ప్రాజెక్టుకుగాను టిసిఎస్, విప్రో, ఇన్పినైట్ కంప్యూటర్ సోల్యూషన్స్ టెక్నికల్ బిడ్స్‌ని దాఖలు చేయడానికి షార్ట్ లిస్ట్ చేయబడ్డ కంపెనీలు. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్ మాత్రమే మిగిలిఉన్నాయి. అన్ని సక్రమంగా జరిగి డిసెంబర్ నెలలో ఈ ప్రాజెక్టుని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం టెక్నికల్ బిడ్‌కి సంబంధించిన పని అంతా పది రోజులలో పూర్తి అవుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకి మొత్తం ఖర్చు సుమారుగా రూ 30 కోట్ల నుండి రూ 35 కోట్ల వరకు అవుతుందని అంచనా. ప్రాజెక్టు విడుదలైన తర్వాత దాని మెయింటెన్స్‌కి ప్రతి సంవత్సరం మొదట దశలో సుమారుగా రూ 12 కోట్ల వరకు అవుతుందని తెలిపారు.

తిరుమల తిరుపతి దేవస్దానాన్ని ప్రతిరోజు సుమారుగా 50,000 మంది భక్తులు దర్శించుకుంటారని తెలిపింది. ఇక సెలవుదినాలు, పండగ రోజుల్లో దాదాపుగా లక్ష వరకు భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్దానం సభ్యులు తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot