జపాన్ భూకంప భాదితుల కోసం సహాయం అందిస్తున్న సాప్ట్‌వేర్ కంపెనీలు

Posted By: Staff

జపాన్ భూకంప భాదితుల కోసం సహాయం అందిస్తున్న సాప్ట్‌వేర్ కంపెనీలు

జపాన్‌లో సంభవించినటువంటి భూకంపం, సునామీ వల్ల ఎక్కువగా నష్టపోయింది మాత్రం సాప్ట్‌వేర్ కంపెనీలేనని అంటున్నారు. అందులో భాగంగానే ప్రపంచంలో పెద్ద టెక్నాలజీ కంపెనీలు అయినటువంటి గూగుల్, ట్విట్టర్ లాంటివి జపాన్‌ భూకంప భాదితులను ఆదుకోవడానికి వాటి వంతు ప్రయత్నాలు అవి చేస్తున్నాయి.

ముఖ్యంగా గూగుల్ కంపెనీని తీసుకుంటే ప్రత్యేకంగా పర్సన్ ఫైండర్ అనే సాప్ట్‌వేర్‌ని రూపోందించడం జరిగింది. దీని వలన మిస్ అయినటువంటి వారి యొక్క బంధువులను గురించి ఇన్పర్మేషన్ ఇందులో తెలుసుకోవచ్చు.

ఇక మైక్రోసాప్ట్ కార్పోరేషన్ విషయానికి వస్తే భూకంపానికి గురి అయినటువంటి కంపెనీలకు ఉచితంగా టెక్నికల్ సపోర్టుతోపాటు, టెంపరరీ సాప్ట్‌వేర్ లైసెన్స్ కలిగినటువంటి సాప్ట్‌వేర్స్‌ని అందివ్వడానికి ముందుకు వచ్చింది.

ఇక ట్విట్టర్ విషయానికి వస్తే భూకంపానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తన ట్వీట్స్ ద్వారా జపాన్ భాదితులకు పంపించడం జరిగింది. సాధారణంగా భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ట్వీట్స్ ద్వారా పంపించారు.

ఇక యాహూ, అమేజాన్ కంపెనీలు వాటి యొక్క హోమ్ పేజిలో జపాన్ భూకంప భాదితుల కోసం విరాళాలు డోనేట్ చేయమని ప్రజలను కోరుతూ లింక్స్‌ని ఉంచడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot