ఫేస్‌బుక్‌, ఎంఓఎల్‌‌కి మద్య అవగాహాన ఒప్పందం..

Posted By: Super

ఫేస్‌బుక్‌, ఎంఓఎల్‌‌కి మద్య అవగాహాన ఒప్పందం..

ఆన్‌లైన్‌ చెల్లింపు సేవలందిస్తున్న ఆసియా సంస్థ ఎంఓఎల్‌ యాక్సెస్‌ పోర్టల్‌ తాజాగా ఫేస్‌బుక్‌ క్రెడిట్స్‌కు పేమెంట్‌ ప్రొవైడర్‌గా సేవలందించనుంది. ఈ మేరకు రెండు కంపెనీల మధ్యా అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ సభ్యులు ఎంఒఎల్‌ పాయింట్స్‌ను ఉపయోగించి రెండు వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్‌ క్రెడిట్స్‌ కొనుగోలు చేయవచ్చని ఎంఒఎల్‌ ఇండియా మేనేజర్‌ ఆశిష్‌ ఖోరియా తెలిపారు.

ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌, అప్లికేషన్స్‌ లాంటి విర్చువల్‌ ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు ఈ వ్యూహాత్మక ఒప్పందం మరింత సౌలభ్యాన్ని అందించనుందని ఆయన అన్నారు. కాగా, ఆసియాలోని ఆన్‌లైన్‌ యూజర్లలో విర్చువల్‌ కరెన్సీగా ఎంఒఎల్‌ పాయింట్లు బాగా పేరొందిన సంగతి తెలిసిందే. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్స్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ క్రెడిట్స్‌, ఐట్యూన్స్‌ లాంటి పాపులర్‌ ఆన్‌లైన్‌ గిఫ్ట్‌ కార్డులు, ఎన్నో రకాల ఆన్‌లైన్‌ కంటెంట్‌, సేవలను పొందేందుకు వేలాది మంది వినియోగదారులు ఎంఒఎల్‌ పాయింట్లను ఉపయోగిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్, మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ రెండు కూడా త్వరలో ఒకటి కానున్నాయని రూమర్ ఇంటర్నెట్లో సంచరిస్తుంది. ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తున్న ఈ రూమర్ ప్రకారం ఈ రెండు కూడా ప్రస్తుతం యూజర్స్‌కు సోషల్ నెట్ వర్కింగ్ అనుభవాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 850 మిలియన్ యూజర్స్ కోసం ఈ రెండు కంపెనీలు కలసి మరిన్ని సేవలను అందించడం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

త్వరలో ఫేస్‌బుక్ యూజర్స్ ఎవరైత్ ఉన్నారో వారు త్వరలో డైరెక్టుగా ట్విట్టర్‌లో ఉన్న తమ ప్రొఫైల్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఫీచర్‌ని పోందుపరచడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ అందించిన రిపోర్ట్ ప్రకారం ఫేస్‌బుక్ ఎకౌంట్ల నుండి ట్విట్టర్ ఎకౌంట్లను డైరెక్టుగా అప్ డేట్ చేసుకునే వెసులుబాటుని కూడా కల్పించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot