జమ్ము- శ్రీనగర్‌ సొరంగ మార్గం, 124 అత్యాధునిక కెమెరాలతో నిరంతర నిఘా

అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో జమ్ము- శ్రీనగర్‌ల మధ్య నిర్మించిన చెనాని - నాష్రీ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. జాతీయ రహదారి 44 వెంబడి 7 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ 9.2 కిలోమీటర్లు రోడ్డు సొరంగ మార్గం ఉదమ్ పూర్ జిల్లాలోని చెనాని ప్రాంతాన్ని రంబన్ జిల్లాలోని నాష్రీతో కలుపుతుంది.

Read More : జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

30 కిలో మీటర్ల దూరం తగ్గింది..

ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రాక ముందు జమ్ము- శ్రీనగర్‌ల మధ్య దూరం 41 కిలోమీటర్లు, సొరంగ మార్గం అందుబాటులోకి వచ్చాక ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం కేవలం 10.9 కిలోమీటర్లు. మంచు చెరియలు విరిగిపడే ప్రమాదం లేని మార్గంలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించటం విశేషం. భారతదేశపు అతిపొడవైన సొరంగ మార్గంగా గుర్తింపుతెచ్చుకున్న చెనాని - నాష్రీ రోడ్డు టన్నెల్ గురించి పలు ఆసక్తిర విషయాలు..

రోజుకు 10జీబి డేటా, BSNL సంచలనం

ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ వ్యవస్ధ

ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ వ్యవస్ధను కలిగి ఉన్న ప్రపంచపు 6వ సొరంగ మార్గంగా చెనాని - నాష్రీ రోడ్డు టన్నెల్ రికార్డు నెలకొల్పింది. సొరంగం లోపలకి గాలి, వెళుతురు ధారళంగా వచ్చే విధంగా ఈ ట్రాన్స్‌వెర్స్ వెంటిలేషన్ వ్యవస్ధ పనిచేస్తుంది. ఈ సొరంగ మార్గం గుండా ప్రయాణించే వారు ప్రతి 8 మీటర్లకు స్వచ్చమైన గాలిని పీల్చుకోగలుగుతారు. అంతేకాకుండా వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కూడా బయటకు వెళ్లిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు ప్రతి 100 మీటర్లకు ఓ మళ్లింపు మార్గాన్ని ఉంచారు. దీని ద్వారా క్షణాల్లో బయటకు వచ్చేయవచ్చు.

ప్రపంచంలోనే అతి‌చిన్న స్మార్ట్‌ఫోన్

మొబైల్ కనెక్టువిటీ సమస్యలే ఉండవు

ఈ సొరంగ మార్గంలో మొబైల్ ఫోన్ కనెక్టువిటీ సమస్యలే ఉండవు. టన్నెల్ మార్గంలో బలమైన సిగ్నల్ వ్యవస్థను నెలకొల్పిందుకు బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఐడియాలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసాయి.

8జీబి ర్యామ్‌తో OnePlus 5

124 కెమెరాలను ఇన్‌స్టాల్ చేసారు

ఈ సొరంగ మార్గంలో మొత్తం 124 కెమెరాలను ఇన్‌స్టాల్ చేసారు. వీటి ద్వారా టన్నెల్ లోపలి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించటం జరుగుతుంది. సొరంగం లోపలి వేడి ఉష్ణోగ్రతలను అంచాన వేసేందుకు ప్రత్యేకమైన పరికరాలను కూడా ఈ మార్గంలో ఏర్పాటు చేసారు. వీటిని ఎప్పటికప్పుడు ఇంటిగ్రేటెడ్ టన్నెల్ కంట్రోల్ రూమర్ పర్యవేక్షిస్తుంటుంది. అత్యవసర పరిస్థితులో ప్రధమ చికిత్సను అందించేందుకు మెడికల్ కిట్లను కూడా ఈ సొరంగ మార్గంలో ఉంచారు.

లీకైన జియో సెట్ టాప్ బాక్స్ ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Tech Facts About India's Longest Road Tunnel Between Chenani- Nashri. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot