హైదరాబాద్‌కు రానున్న ఇంటెల్ సంస్థ

|

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్‌ హైదరాబాద్‌లో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతుంది. భారత్ లో కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. టెక్నాలజీ సెంటర్‌ ఆరంభంలోనే ఇంటెల్‌ 1,500 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను నియమించుకోనుంది. భవిష్యత్‌లో ఈ ఉద్యోగుల సంఖ్య 5 వేల వరకు పెరిగే అవకాశముంది.ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృత్తి రాయ్‌ శుక్రవారం తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌తో బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశమై టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుపై చర్చలు జరిపారు.

 

నమస్తే ఇండియా అంటున్న ఇన్‌స్టా‌గ్రామ్నమస్తే ఇండియా అంటున్న ఇన్‌స్టా‌గ్రామ్

ఇంటెల్ సీఈవోతో త్వరలోనే భేటీ కానున్న కేటీఆర్‌...

ఇంటెల్ సీఈవోతో త్వరలోనే భేటీ కానున్న కేటీఆర్‌...

ఈ ప్రాజెక్ట్ విషయమై ఇంటెల్ గ్లోబల్ సీఈవోతో కేటిఆర్ త్వరలోనే భేటీ అయ్యి చర్చించనున్నారు. ఈ నెల 15న బెంగళూరులోని ఇంటెల్‌ ప్రాంగణంలో జరిగే సంస్థ 20వ వార్షికోత్సవ సంబరాలకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్‌ను ఇంటెల్‌ ఇండియా అధిపతి నివృత్తి రాయ్‌ ఆహ్వానించారు. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్, టీ-వర్క్స్, రాష్ట్రం లోని ఇతర స్టార్టప్‌ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఇంటెల్‌ కంపెనీ సుముఖంగా ఉందని తెలిపారు.

ఆపిల్ ,ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు...

ఆపిల్ ,ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు...

ఇప్పుడు హైదరాబాద్‌లో MNC కంపెనీలు పోటీ పడి తమ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి.ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజాలైన ఆపిల్ ,ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసాయి. ఇదేవిధంగా మొబైల్ హ్యాండ్‌సెట్ చిప్‌ల తయారీలో ప్రపంచ ఖ్యాతి పొందిన క్వాల్‌కామ్ సంస్థ రూ.3 వేలకోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేసి 10 వేలమందికి ఉద్యోగాలు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.

హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టిన,పెట్టబోతున్న కంపెనీల వివరాలు....
 

హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టిన,పెట్టబోతున్న కంపెనీల వివరాలు....

గూగుల్-1000 కోట్లు
ఉబర్-5 కోట్ల డాలర్లు
ఐకియా-1000 కోట్లు
ఎస్‌ఎంటీ-250 కోట్లు
మైక్రాన్ టెక్నాలజీస్-300 కోట్లు

Most Read Articles
Best Mobiles in India

English summary
Tech giant Intel to set up development centre in Hyderabad.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X