టెక్‌‍‌లో సత్యం విలీనమైతే ఆసియాలోనే భారీ ఐటీ కంపెనీ

Posted By: Super

టెక్‌‍‌లో సత్యం విలీనమైతే ఆసియాలోనే భారీ ఐటీ కంపెనీ

హైదరాబాద్: టెక్ మహీంద్రా, మహీంద్రా సత్యం కంపెనీలు విలీనమైతే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారీ ఐటీ కంపెనీ అవతరిస్తుందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) తెలి పింది. అలా అవతరించే కంపెనీ భారత్‌లోనే కాకుండా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కూడా ప్రధాన ఐటీ కంపెనీలకు గట్టిపోటీనిస్తుందని పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కలసి పనిచేయడం మంచి ఫలితాలనిచ్చిందని వివరించింది. దీనివల్లే గత ఏడాది మహీంద్రా సత్యం కంపెనీకి 10 మంది కొత్త క్లయింట్లు లభించారని- ఐడీసీ వివరించింది. గత నెల 8న జరిగిన మహీంద్రా సత్యం విశ్లేషకుల సమావేశంలో జరిగిన చర్చలు, ప్రజంటేషన్లు ఆధారంగా, మార్కెట్ ఇంటెలి జెన్స్, అడ్వైజరీ సర్వీసులందజేసే ఐడీసీ రూపొందించిన నివేదిక ఈ వివరాలు తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot