టెక్‌ మహింద్రా నష్టాలకు సత్యమే కారణం: టెక్‌ మహింద్రా

Posted By: Super

టెక్‌ మహింద్రా నష్టాలకు సత్యమే కారణం: టెక్‌ మహింద్రా

ప్రముఖ ఐటీ రంగ సంస్థ, టెక్‌ మహింద్రా వార్షిక లాభాలు భారీ స్థాయిలో పతనమయ్యాయి. దేశీయ ఐటీ రంగంలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న టెక్‌ మహింద్రా..మార్చి 31తో ముగిసిన త్రైమాసికం లాభాలు 59 శాతం పడిపోయాయి. 2009-10 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.227 కోట్ల నికర లాభాలను సాధించగా, 2010-11 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మాత్రం రూ.92.2 కోట్లతో సరిపెట్టుకుంది. దీంతో 59 శాతం లాభాలు పడిపోయాయని పేర్కొన్న సంస్థ వర్గాలు..ఇందుకు కారణం 2009లో టేకోవర్‌ చేసిన సత్యం కంప్యూటర్సేనని టెక్‌ మహింద్రా స్పష్టం చేసింది.

ఇటీవల మహింద్రా సత్యం ప్రకటించిన ఆర్థిక ఫలితాలలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే గతంలో సత్యం కంప్యూటర్స్‌ తప్పుడు లెక్కలతో అమెరికా స్టాక్‌ మార్కెట్లో నష్టపోయిన వాటా దారులకు ఒకేసారి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని టెక్‌ మహింద్రా చెల్లించిందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సహజంగానే టెక్‌ మహింద్రా లాభాల్లో కోత పడిందని తెలిపాయి.

అంతేగాక ప్రత్యర్థి సంస్థలైన టీసిఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థల పోటీ కారణంగా ఉద్యోగులకు అధిక మొత్తంలో జీతభత్యాలు చెల్లించాల్సి వస్తోందని, అలాగే తక్కువ మొత్తాలకే పని చేయాల్సి వస్తోందని టెక్‌ మహింద్రా ఛీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి సంజయ్‌ ఆనంద్‌ తెలిపారు. ప్రస్తుతం టెక్‌ మహింద్రా సంస్థలో 4,125 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, కొత్తగా ఈ త్రైమాసికంలో 15 క్లైయింట్లు చేరారన్నారు. మరోవైపు బొంబాయి స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లో 0.3 శాతం మేర స్వల్పంగా నష్టపోయింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot