గుజరాత్ టెక్నికల్ హైస్కూల్స్‌ టీచర్స్‌కు జీతాలు కరువు

Posted By: Staff

గుజరాత్ టెక్నికల్ హైస్కూల్స్‌ టీచర్స్‌కు జీతాలు కరువు

గుజరాత్ ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి టెక్నికల్ హైస్కూల్స్‌లో పనిచేస్తున్నటువంటి టీచర్స్‌కు గత రెండు నెలలుగా జీతాలు అందడంలేదని వాపోతున్నారు. మొత్తం గుజరాత్ రాష్ట్రంలో 25 టెక్నకల్ స్కూళ్శకుగాను 700 మంది టీచర్స్‌ని నియమించడం జరిగింది. ఈ ఇరవై అయిదు స్కూళ్శలో ముఖ్యంగా 5స్కూళ్శల్లో అసలు మూడు నెలలు నుండి జీతాలే తీసుకోవడం లేదని టీచర్స్ వారి ఆవేదనను తెలియచేస్తున్నారు.

ముఖ్యంగా మూడు, నాల్గవ గ్రూపులకు సంబంధించినటువంటి టీచర్స్ పరిస్ధితి అయితే మరీ దారుణంగా ఉందని అంటున్నారు. గత ఫిబ్రవరిలో కాలేజికి సంబంధించినటువంటి టీచర్స్ కూడా ఇదేవిధంగా ఇబ్బందులు పడడం జరిగింది. గవర్నమెంట్‌తో ఫైట్ చేయడం వల్ల రెండు నెలలకు ముందే కాలేజీ టీచర్స్ వారి జీతాలను పోందడం జరిగింది.

ఇకపోతే ఈ టెక్నకల్ స్కూళ్శు అన్ని గుజరాత్ లోని మారుమూల గ్రామాలలో ఉండడం, అంతేకాకుండా ఇవన్నీ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ టెక్నకల్ ఎడ్యుకేషన్ క్రింద ఉండడంతో వీరికి తలకాయ నోప్పిగా ఉందంటున్నారు. అంతేకాకుండా విద్యార్దుల కోసం ప్రత్యేకంగా ఒకేషనల్ కోర్స్‌లను కూడా ఈస్కూళ్శు నిర్వహిస్తున్నాయి. జీతాలు రాకపోవడం వల్ల టీచర్స్ అందరూ గవర్నమెంట్‌కి స్టైక్ లెటర్ ఇవ్వడం జరిగింది. మొదటగా గవర్నమెంట్‌ని సంప్రదించినా వారి నుండి జీతాలు గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందని స్కూల్ టీచర్స్ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు వెల్లడించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting