వివాహిత జీవితం సుఖంగా ఉండదు అందుకే ఆత్మహత్య: సాప్ట్‌వేర్ డిజైనర్

Posted By: Staff

వివాహిత జీవితం సుఖంగా ఉండదు అందుకే ఆత్మహత్య: సాప్ట్‌వేర్ డిజైనర్

న్యూఢిల్లీ: 27 సంవత్సరాల సాప్ట్‌వేర్ డిజైనర్ బుధవారం రాత్రి అపర్మారక స్దితిలో ఆత్మహాత్య చేసుకోని చనిపోయాడు. అతను ఆత్మహాత్య చేసుకోవడానికి కారణం తను పెళ్శి చేసుకుంటే తన వివాహిత జీవితం అంత సుఖంగా ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఇది ఇలా ఉండగా ఈ సంవత్సరం జూన్‌లో అతని పెళ్శి జరగనుండడం మరో విశేషం. పెళ్శికి ముందు అతను ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ సాప్ట్‌వేర్ డిజైనర్ పేరు రాణా కుమార్ సింగ్. తన స్వస్దలం బీహార్ లోని సహారా. ప్రస్తుతం తాను తన స్నేహితులతో సౌత్ ఢిల్లీలోని లాడో సరాయ్ ఏరియాలో ఫ్లాట్‌లలో ఉంటున్నాడు. వీళ్శు నివసిస్తున్నటువంటి ఫ్లాట్ రెంట్‌కి తీసుకోని ముగ్గురు స్నేహితులు అందులో కలసి ఉంటున్నారని, రాణా కుమార్ సింగ్ ఉరివేసుకోని ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించినట్టు స్నేహితులు తెలియజేశారు. రాణా కుమార్ సింగ్ స్నేహితులు అతనిని చూడడానికి వచ్చినప్పుడు అతను ఉరివేసుకోని ఉండడం చూసి స్నేహితులు ఆశ్చర్యపోయారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting