దొంగతనాలు చేసి కింగ్‌లా బ్రతుకుతున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్

Posted By: Super

దొంగతనాలు చేసి కింగ్‌లా బ్రతుకుతున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్

బెంగళూరు: బెంగళూరులో ఎయిర్ కండీషన్ ఇల్లు. షికార్లు చేయడానికి మంచి ఫ్యాన్సీ వెహికిల్స్, దాదాపు వంద జతలకు మించిన షర్ట్స్, షూట్స్. ఎవరిని ఉద్దేశించి ఈవిషయాలు చెబుతున్నానని అనుకుంటున్నారా కంప్యూటర్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబు. ఇంత లగ్జరీగా గడపడానికి అతను చేసేటుటవంటి ఉద్యోగం సాప్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం కాదు. సాప్ట్ వేర్ ఇంజనీర్ ముసుగులో వాహానాలను దోంగతనం చేయడం. అతను మాట్లాడేటటువంటి మాటలు, మ్యానరిజమ్, అతను ధరించినటువంటి బట్టలు అచ్చం సాప్ట్ వేర్ ఇంజనీర్‌ని తలపించినా అతను చేసే వృత్తి మాత్రం దోంగతనం.

ఈ 26 సంవత్సరాల వయసు కలిగినటువంటి కంప్యూటర్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబు తన ఇంజనీరింగ్ పట్టాని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తీసుకున్నారు. ఇంజనీరింగ్ లో అతని ఉత్తీర్ణత 73 శాతం. అతర్వాత బెంగళూరు ఉద్యోగం కోసం వచ్చినటువంటి బాబు కుడ్లు గ్రామంలో అద్దెకు ఇల్లు తీసుకోవడం జరిగింది. జాబ్ ట్రయల్స్ వేయగా జెపి నగర్ లోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతను సంపాదించేటటువంటి డబ్బులు చాలకపోవడంతో పాటు, జాబ్ కూడా బోర్ కోట్టడంతో వెహికల్స్ దోంగతనం చేసి ఎక్కువ డబ్బు సంపాదించవచ్చుననే నిర్ణయం తీసుకోవడం జరగింది.

మొదటగా తన దోంగతనం ప్రస్దానాన్ని ఎలా ప్రారంభించాడో సిద్దాపుర పోలీస్ ఇన్‌స్పెక్టర్ బియస్ అంగాడి తనదైన శైలిలో వివరించారు. వాహానాలు తక్కువ ఉన్నచోటు చూసుకోని మోకానిక్‌కి ఫోన్ చేసి తన యొక్క వాహానం తాళాలు పోయాయని చెప్పి డూప్లికేట్ తాళాలు అతని చేత చేయించుకోని ఆ వాహానాన్ని అమ్ముకోవడం జరుగుతుందని అన్నారు. ఇలా ఒక మోటార్ సైకిల్‌తో ప్రారంభించినటువంటి తన దోంగతనం రోజురోజుకి పెరుగుతూ అతనికి కోంత మంది మోకానిక్స్ ప్రెండ్స్ అవ్వడం వరకు వెళ్శింది. దాంతో సిటిలో ఉన్నటువంటి ఎక్కువ మంది మోకానిక్స్ అతనికి టచ్‌లో ఉండడం మాత్రమే కాకుండా అతను దోంగిలించినటువంటి వాహానాలు సిటీలోని అన్ని గ్యారేజిలలో అమ్ముడవ్వడం విశేషం. ఇంకేముంది ఆతర్వాత దోంగిలించినటువంటి వాహానాలకు దోంగ డాక్యుమెంట్స్ సృష్టించడం చేసేవాడని ఆయన అన్నారు.

దోంగతనం చేసినటువంటి బాబు చివరకు సిద్దాపురు పోలీసులకు దోరికిపోయాడు. దాంతో సిద్దాపుర పోలీసులు ఒక్కసారిగా 37 వెహికల్ లిప్టింగ్ కేసులు, రూ 25.8లక్షలు విలువ చేసేటుటవంటి 30 టూ-వీలర్స్‌ని రికవరీ చేయడం, రూ 4.2లక్షలు విలువ చేసేటుటవంటి మారుతీ కారుని కూడా రికవరీ చేయడం జరిగింది. పోలీసులకు సాప్ట్ వేర్ ఇంజనీర్ అయిఉండి ఇలాంచి పనులు ఎందుకు చేశావ్ అని అడిగితే త్వరగా డబ్బు సంపాదించడం కోసమే సాప్టా వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ వృత్తిని ఎంచుకున్నట్లు చెప్పాడు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot