మిల్క్ డైరీ కోసం జాబ్స్ వదిలిపెట్టిన విప్రో మాజీ సాప్ట్‌వేర్ ఇంజనీర్స్

Posted By: Super

మిల్క్ డైరీ కోసం జాబ్స్ వదిలిపెట్టిన విప్రో మాజీ సాప్ట్‌వేర్ ఇంజనీర్స్

హాసాన్: విప్రో టెక్నాలజీస్‌లో పని చేస్తున్నటువంటి నలుగురు మాజీ సాప్ట్ వేర్ ఇంజనీర్స్ వారి యొక్క వేల రూపాయలు ఆర్జించే జాబ్స్‌కు డుమ్మా కొట్టి నాలుగు నెలల క్రితం వ్యాపార వేత్తలుగా మారారు. టెక్నాలజీ ప్రపంచాలని దూరమైనటువంటి వారు చేసేటటువంటి జాబ్ ఏమిటని అనుకుంటున్నారా... హాసాన్ జిల్లాలోని చెన్నరాయపట్న తాలుకాలోని కోడిహాల్లి అనే గ్రామంలో మిల్క్ డైరీని పెట్టడం జరిగింది. 15సంవత్సరాల ఎక్సీపీరియన్స్ కలిగినటువంటి వీరు మంచి లగ్జరీ లైఫ్‌ని కాదని మిల్క్ డైరీని ఎంచుకున్నారు. ఇందులో వీరికి ఆనందం దొరుకుతుందని... అంతేకాకుండా ఆఫీస్‌లో ఐతే పని నుండి తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ ఆవుల నుండి తప్పించుకోలేం అంటూ సరదాగా అంటున్నారు. ఇంతకీ వారి పేర్లు మీకు చెప్పనేలేదు కదూ... ఆనలుగురు శశికుమార్, రంజిత్ ముకుందన్, వెంకటేష్ శేషసాయి, ప్రవీణ్ నాలే.

ఈ సందర్బంలో శశి కుమార్ మాట్లాడుతూ మేము డైరీ బిజినెస్‌ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకోవడం తీసుకోవడం జరిగింది. అంతే కాకుండా ఎంతో ఇష్టంతో ఈ రంగంలోకి రావడం జరిగింది. దీనికి మేము పెట్టినటువంటి పేరు అక్షయకల్ప ఫామ్స్ అండ్ పుడ్స్ లిమిటెడ్. దీనికి ముఖ్య వ్యక్తులుగా డైరీ బిజినెస్‌లో ఎప్పటి నుండో అనుభవం ఉన్నటువంటి జిఎన్‌‌ఎస్ రెడ్డి, టి ప్రసన్నలను ఉంచడం జరిగింది. ఇందులో మొత్తం 21మంది పాట్నర్స్ ఉండగా అందులో మేము నలుగురుం కూడా ఉన్నాం. ఈ రంగంలోకి మేము రావడానికి వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను చైతన్య వంతులను చేసి అగ్రో సెక్టార్‌ని ముందుకు తీసుకువెళ్శాలని మా నిర్ణయం అని అన్నారు.

బిజినెస్‌కు టెక్నాలజీని అనుసంధానం చేసి అటు రైతులకు, వినియోగదారుడు ఇద్దరికి లాభం చేకూర్చాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం. మొత్తం మిల్క్ డైరీని రూ 15కోట్ల పెట్టి 24 ఎకరాల్లో నిర్మించడం జరిగింది. అంతేకాకుండా కోడిహాల్లి గ్రామం చుట్టుప్రక్కల ఉన్నటువంటి 300 మంది రైతులను డైరీకి మిల్క్ పంపించేందుకు సెలెక్టు చేసుకోవడం జరిగింది. మిల్కింగ్ మెషిన్స్, మిల్క్ ఉత్పత్తిని ఎలా పెంచాలి అనే దానిపై రైతులను ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. రంజిత్ ముకుందన్ మాట్లాడుతూ రాబోయేటటువంటి ఐదు నెలలో దాదాపు 500 మంది గ్రామస్దులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా ఈ డైరీ వల్ల బ్యాంక్స్ నుండి లోన్స్ పోంది రైతులు ఆవులు కొనుక్కునేటటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాం. ఎవరైతే రైతులు దళారీల నుండి మోసపోతున్నారో, ఈసారి నుండి అలా జరగకుండా రైతులు డైరెక్టుగా డైరీకే పాలు పోసేటటువంటి ఫెసిలిటీ కల్పిస్తున్నాం అని అన్నారు. ఎవరైతే మా డైరీలో రిజస్టర్డ్ మెంబర్స్‌గా కోనసాగుతారో అలాంటి వారి యొక్క ఆవులు, గేదెలకు రెగ్యులర్‌గా మెడికల్ చెకప్స్ చేస్తామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot