ఎయిర్‌టెల్‌ని నమ్ముకున్నందుకు గుండె గుభేలయింది !

Written By:

కష్టమర్ కి ఎయిర్‌టెల్ షాకిచ్చింది. దాదాపు గుండె ఆగినంత పనిచేసింది. చివరకు తన తప్పు తెలుసుకుని అతనికి మరో బిల్లును పంపింది. అయితే అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వివరాల్లోకెళితే..

హానర్ ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, తగ్గింపు రూ.13 వేలకు పైగానే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు లక్షల బిల్లు

విహారయాత్రకు వెళ్లిన ఓ వ్యక్తికి నెలాఖరుకు వచ్చిన ఫోన్ బిల్లు చూసి గుండె గుబేల్‌మన్నది. ఎందుకంటే అతడికి వచ్చిన బిల్లు వందల్లోనో, వేలల్లోనో కాదు.. దాదాపు రెండు లక్షల బిల్లు వచ్చింది.

ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ టూర్‌

న్యూఢిల్లీకి చెందిన నితిన్ సేథి గత నెలలో ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ టూర్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో 10 రోజులకుగానూ ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీని యాక్టివేట్ చేసుకున్నాడు. టూర్ ముగిసిన తర్వాత భారత్‌కు వచ్చినా ప్యాకేజీ డి యాక్టివేట్ కాలేదు.

జూన్ 8 నుంచి జూలై 7 వరకు

దీంతో సేథికి జూన్ 8 నుంచి జూలై 7 వరకు నెల ఫోన్ బిల్లు రూ. 1.86 లక్షలు జనరేట్ అయింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ నుంచి ఆ బిల్లు మెస్సేజ్ రాగానే ఆ కస్టమర్ షాక్ తిన్నాడు.

కస్టమర్ కేర్‌కు కాల్ చేసి

ఎయిర్‌టెల్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి ఫోన్ బిల్లు భారీ మొత్తంలో రావడంపై ఫిర్యాదు చేశాడు. సాంకేతిక కారణాల వల్ల బిల్లు భారీగా వచ్చిందని త్వరలోనే తప్పును సరిదిద్దుకుని మరో బిల్లును పంపిస్తామని ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటీవ్ సెథికి హామీ ఇచ్చారు.

భారీ బిల్లు విషయాన్ని

తనకు వచ్చిన భారీ బిల్లు విషయాన్ని బాధితుడు సేథి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది వైరల్‌గా మారింది. దీనిపై ఎయిర్‌టెల్ తక్షణం స్పందించడం కొసమెరుపు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Man received Rs 1,86,553 bill from Airtel, company says it was error and fixes it Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting