టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు

|

ఇండియాలోని స్మార్ట్‌ఫోన్‌ రంగంలో గట్టి పోటీ ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం.గత రెండు వారాలుగా ప్రతి స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వారు తమ తమ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్ లో రిలీజ్ చేసారు.ఇప్పుడు ట్రాన్స్‌షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని టెక్నో కూడా ఇటీవల తన స్పార్క్ సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో టెక్నో స్పార్క్ గో ఫోన్ 5,499 రూపాయల ధర వద్ద మరియు టెక్నో స్పార్క్ 4 ఎయిర్ 6,999 రూపాయల ధరతో నిర్ణయించబడ్డాయి.

టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌ పూర్తి వివరాలు

 

టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌ ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లలో ఉత్తమంగా ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. కొత్త టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌ ఎంత వరకు గొప్పదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిజైన్

డిజైన్

టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌ ప్లాస్టిక్ బాడీతో ఉత్తమంగా మంచిగా కనిపించే డివైస్. ఈ రోజుల్లో ఉన్న చాలా ఫోన్‌ల మాదిరిగా కాకుండా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ యొక్క వెనుక ప్యానెల్ తొలగించదగినది. అంటే బ్యాటరీను రిమువ్ చేయడనికి వీలుగా ఉంటుంది. కొనుగోలుదారుల కోసం ఇది నెబ్యులా బ్లాక్ మరియు రాయల్ పర్పుల్‌ వంటి రెండు కలర్స్ ఎంపికలలో అందుబాటులో ఉంది.

డిస్ప్లే

డిస్ప్లే

టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌ యొక్క ముందు వైపు 6.1-అంగుళాల డాట్ నోచ్డ్ డిస్‌ప్లే స్క్రీన్ చుట్టూ ఉదార బెజెల్స్‌ నిర్మాణం ఉంటుంది. డిస్ప్లే HD + (1560 × 720 పిక్సెల్స్) రిజల్యూషన్ మరియు 19.5: 9 కారక నిష్పత్తితో వస్తుంది. డాట్ నాచ్ లో సెల్ఫీ కెమెరా పొందుపరచబడి ఉంటుంది. క్లుప్త సమయంలో స్పార్క్ గో యొక్క డిస్ప్లే మంచిదని నేను గుర్తించాను కానీ అంత గొప్పది కాదు.

ప్యానల్ నిర్మాణం
 

ప్యానల్ నిర్మాణం

ఫోన్ యొక్క కుడి వైపున మీరు పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ను చూడవచ్చు. ఎడమ మరియు పైభాగం ఖాళీగా ఉంటాయి. దిగువ వైపు 3.5mm ఆడియో జాక్ మరియు మైక్రో-యుఎస్బి పోర్టు ఉంటుంది. అలాగే వెనుక వైపు ఎగువ-ఎడమ మూలలో కెమెరా మాడ్యూల్ మరియు దిగువ వైపు స్పీకర్ గ్రిల్‌ ఉంటుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఎంట్రీ లెవల్ టెక్నో గో స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో A22 క్వాడ్-కోర్ SoC కింద ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో ఎంచుకోవడానికి ఒకే ఒక వేరియంట్ ఉంది. ఇందులో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 2GB RAM మాత్రమే ఉన్నాయి. ఇందులో మైక్రో SD కార్డ్ ఉపయోగించి మెమరీని 256GB వరకు విస్తరించవచ్చు. సాఫ్ట్‌వేర్ విషయంలో ఈ ఫోన్ సంస్థ యొక్క HiOS 5.0 కింద మరియు ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా రన్ అవుతుంది.

కెమెరాలు

కెమెరాలు

కెమెరాల విషయంలో టెక్నో గో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా AI- మోడ్ ఫీచర్ తో వస్తుంది. అంతేకాకుండా తక్కువ లైట్ల వెలుగులో ఫోటోలు మరియు వీడియో కోసం ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. అలాగే ఎంచుకోవడానికి వివిధ రకాల మోడ్‌లు ఉన్నాయి. వీటిలో వీడియో, AI CAM, బ్యూటీ, Bokeh, AR షాట్ మరియు పనోరమా ఉన్నాయి. వెనుకవైపు గల కెమెరాల విషయానికి వస్తే డ్యూయల్-ఫ్లాష్ ద్వారా సహాయపడే ఒకే ఒక 8 మెగాపిక్సెల్ AI- బ్యాక్డ్ కెమెరా ఉంది. ఈ ఫోన్ యొక్క ధరతో పరిశీలిస్తే రెండు కెమెరాలు మంచివిగా అనిపిస్తాయి.

బ్యాటరీ

బ్యాటరీ

టెక్నో స్పార్క్ గో స్మార్ట్‌ఫోన్‌ 3,000 mAh తొలగించగల బ్యాటరీ మద్దతుతో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం మీరు AI- ఆధారిత ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ను పొందుతారు. అయితే ఇందులో ఆన్‌బోర్డ్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. అంతర్నిర్మిత మూడు కార్డ్ స్లాట్లు ఉన్నాయి. రెండు సిమ్ కార్డుల కోసం మరియు మూడవది మైక్రో ఎస్డీ కార్డు కోసం.

టెక్నో స్పార్క్ గో ఫస్ట్ ఇంప్రెషన్స్

టెక్నో స్పార్క్ గో ఫస్ట్ ఇంప్రెషన్స్

టెక్నో స్పార్క్ గో దాని ధర 5,499 రూపాయలకు మంచి ఎంపికగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇష్టపడటానికి చాలా ఉంది. కొనుగోలుదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చేలా టెక్నో 799 రూపాయల విలువైన బ్లూటూత్ ఇయర్ ఫోన్‌లను ఉచితంగా అందిస్తోంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Techno Spark Go Smartphone Review:Price,Specifications and Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X