‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న ఆవిష్కరణలే. ఇవి అందుబాటులోకి రాకుముంది మనిషికి ఏ విధమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది..?. ఇప్పుడు మనం ఎంచక్కా ఆండ్రాయిడ్ ఫోన్‌లు, యాపిల్ ఐప్యాడ్‌లతో స్మార్ట్ టెక్నాలజీ ఆస్వాదిస్తున్నాం. సాంకేతికత అప్పుడప్పుడే విస్తరిస్తోన్న ఆ రోజుల్లో మనిషి ఏ గాడ్జెట్ల పై ఆధారపడేవాడు..? టెక్నాలజీ విస్తరిస్తోన్న తొలినాళ్లలో ప్రపంచానికి పరిచయమైన 10 వినూత్న టెక్నాలజీ గాడ్జెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..
Read More: భారతదేశ శాస్ర్తవేత్తలు

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
ఏటీ&టీ వీడియో ఫోన్ 2500
స్కైప్, ఫేస్‌టైమ్ వంటి వీడియో కాలింగ్ యాప్‌లు అందుబాటులోకి రాకముందు ఏటీ&టీ వీడియో ఫోన్ ఒక్కటే వినియోగదారులకు వాయిస్ కమ్యూనికేషన్ సేవలను అందించేది. 1993 డాలర్ రేటు ప్రకారం ఈ ఫోన్ ధర 1500 యూఎస్ డాలర్లు. 3.3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్‌ను కలిగి ఉండే ఈ ఫోన్‌ను సాధారణ ఫోన్ లైన్‌ల పై స్పందించేది.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
డైమెండ్ రియో ఎంపీ3 ప్లేయర్
1998, అంటే యాపిల్ ఐపోడ్ కు మూడు సంవత్సరాల ముందు డైమెండ్ రియో పీఎమ్ పీ300 పేరుతో మొట్టమొదటి కమర్షియన్ ఎంపీ3 ప్లేయర్ మార్కెట్లో విడుదలైంది. డౌన్‌లోడింగ్ సర్వీసును సైతం ఈ డివైస్ ఆఫర్ చేసేంది. 30 నిమిషాల నిడివి గల ఆడియోను ఈ ప్లేయర్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
డ్రాగన్ స్పీచ్ రికగ్నిషన్
15 సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చిన డ్రాగన్‌స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకునే ముందు మీకు అనుగుణంగా శిక్షణను ఇవ్వవల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యపిల్ సిరీ, ఆండ్రాయిడ్ గూగుల్ నౌ వాయిస్ రికగ్నిషన్ ఫీచర్లు ఏ విధమైన శిక్షణ అవసరం లేకుండానే స్పందిస్తాయి.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
కాలికో ఎలక్ట్రానిక్ క్వార్టర్‌బ్యాక్
ఈ హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ డివైస్ 1978లో అందుబాటులోకి వచ్చింది.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
ఎమ్ఎస్ఎన్ టీవీ
1996లో అందుబాుటలోకి వచ్చిన టెక్నాలజీ టెలివిజన్ ఆధారిత ఆన్‌లైన్ బ్రౌజింగ్‌ను స్టాండర్డ్ టెలిపోన్ లైన్‌ల ద్వారా అందిచేంది.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
పోలరాయిడ్ పాలోవిజన్
1977లో అందుబాటులోకి వచ్చిన పోలరాయిడ్ పాలోవిజన్ ఫిల్మ్ ఇమేజ్‌ను తక్షణమే అభివృద్థి చేసి ఫోటోను అందించేది. అయితే ఈ ఫోటోలు తక్కువ క్వాలిటీని కలిగి ఉండేవి. పోలరాయిడ్ సంస్థ ఇప్పటికి పలు ఇన్‌స్టెంట్ ఇమేజింగ్ కెమెరాలను ఆఫర్ చేస్తుంది.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
సోనీ డిజిటల్ క్యాసెట్ ప్లేయర్స్/రికార్డర్స్
సోనీ రకరకాల డిజిటల్ క్యాసెట్ ప్లేయర్లతో పాటు రికార్డర్‌లను 1987 నుంచి అందుబాటులోకి తీసుకురావటం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల పాటు వీటికి విపరీతమైన క్రేజ్ లభించినప్పటికి సీడీలు అందుబాటులోకి రావటంతో ఆదరణ తగ్గిపోయింది.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
మాట్టిల్ పవర్ గ్లవ్(Mattel Power Glove)
1989లో విడుదలైన ఈ పవర్ గ్లవ్ నింటెండో గేమ్స్‌కు కంట్రోలర్‌గా ఉపయోగపడేది. 8 బిట్ ప్రాసెసింగ్ పవర్‌తో పాటు రెండు ట్రాన్స్‌మిటర్‌లను గ్లవ్‌లో ఏర్పాటు చేసారు. ఒక్క యునైటెడ్ స్టేట్స్‌లోనే లక్షకు పైగా మాట్టిల్ పవర్ గ్లవ్ యూనిట్లను ఆ రోజుల్లో కొనగోలు చేసారట.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
పామ్ పైలెట్
పామ్ పైలెట్, ఫోన్ తరహాలో ఉండే తక్కువ ఖరీదు గల ఈ గాడ్జెట్ 1997లో విడుదలైంది. యాపిల్స్ న్యూటన్ మెసేజ్ ప్యాడ్ తరహాలోనే ఈ డివైస్‌లో నోట్స్ రాసుకోవటంతో పాటు కాంటాక్ట్‌లను అలానే క్యాలెండర్‌లను స్టోర్ చేసేవారు.

‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’
యాపిల్స్ న్యూటన్ మెసేజ్ ప్యాడ్
హై ప్రోఫైల్ టెక్నాలజీతో కూడిన ఈ పర్సనల్ ఆర్గనైజర్ 1993లో మార్కెట్లోకి వచ్చంది. యాపిల్ ఈ గాడ్జెట్‌ను పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ (పీడీఏ)గా అభివర్ణించింది. ఆ రోజుల్లో కీలక పాత్రపోషించిన ఈ డివైస్‌లో నోట్స్ రాసుకోవటంతో పాటు కాంటాక్ట్‌లను అలానే క్యాలెండర్‌లను స్టోర్ చేసేవారు. ఫ్యాక్స్‌లను పంపుకునేందుకు కూడా ఈ వింటేజ్
డివైస్ దోహదపడేది.


Click it and Unblock the Notifications








