మూవీ రెంటల్ సర్వీస్‌ని జపాన్‌కి విస్తరించిన యూట్యూబ్

Posted By: Super

మూవీ రెంటల్ సర్వీస్‌ని జపాన్‌కి విస్తరించిన యూట్యూబ్

గూగుల్ అనుబంధంగా పని చేస్తున్న వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ అక్టోబర్‌లో లండన్ ఆ తర్వాత సెప్టెంబర్‌లో మూవీస్ రెంటల్ సర్వీస్‌ని కెనడాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐతే ఇప్పడు కొత్తగా యూట్యూబ్ మూవీ రెంటల్ సర్వీస్‌‍ని జపాన్‌కు విస్తరించనుంది. వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్ అయిన యూట్యూబ్ ద్వారా జపాన్‌కు చెందిన లోకల్ యూజర్స్ హాలీవుడ్, లోకల్ జపనీస్‌కి చెందిన సినిమాలను వీక్షించవచ్చని ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ జపాన్‌కు చెందిన డైరెక్టర్ మిజునో తెలిపారు.

ఈ సందర్బంలో మిజునో మాట్లాడుతూ జపాన్‌కు చెందిన ఫేమస్ స్టూడియోలైన బండాయ్, టోయ్‌లకు సంబంధించిన సినిమాలతో పాటు, హాలీవుడ్ ఓల్డ్ క్లాసికల్స్ మూవీలతో పాటు, జపాన్ లోకల్ లాంగ్వేజికి సంబంధించిన కొన్ని వందల కొద్ది సినిమాలను యూట్యూబ్ మూవీ రెంటల్ ద్వారా అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటితో పాటు హాలీవుడ్ పాపులర్ స్టూడియోలైన వార్నర్ బ్రదర్స్, యూనివర్సిల్ స్టూడియో, సోనీ పిక్చర్స్ హోం ఎంటర్టెన్మెంట్‌కి సంబంధించిన బాక్సాఫీసు సినిమాలను ఇందులో ఉంచడం జరుగుతుంది అన్నారు.

హ్యారీ పోట్టర్‌కు సంబంధించిన అన్ని సిరిస్ సినిమాలను యూట్యూబ్‌లో ఉంచామన్నారు. మేము ప్రవేశపెట్టిన ఈ మూవీ పేజి ద్వారా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలను, సినిమాలను కస్టమర్స్ పొందవచ్చని తెలిపారు. ఐతే ప్రస్తుతానికి ఒక్కో సినిమాకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని ప్రస్తావించ లేదు. లండన్‌లో ఉన్న యూజర్స్ ఏవిధంగానైతే డబ్బుని చెల్లిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా వసూలు చేయవచ్చుని తెలిపారు. 30 రోజులకు గాను యూజర్స్ వద్ద నుండి

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot