న్యూస్ బ్రాడ్ క్యాస్టింగ్‌లో జపాన్ వినూత్న ప్రయోగం, సైన్ లాంగ్వేజి

Posted By: Staff

న్యూస్ బ్రాడ్ క్యాస్టింగ్‌లో జపాన్ వినూత్న ప్రయోగం, సైన్ లాంగ్వేజి

జపాన్‌ది టెక్నాలజీ రంగంలో అందెవేసిన చేయి. అలాంటి జపాన్‌కు సంబంధించిన ఎన్‌హెచ్‌కె సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ లేబరేటరీస్ ఓ సరిక్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ సరిక్రొత్త టెక్నాలజీ ఏమిటంటే ఆటోమేటిక్‌గా యానిమేటెడ్ సైన్ లాంగ్వేజిని బ్రాడ్ క్యాస్ట్ విధానంలో పొందుపరచనుంది. ఈ ఆటోమేటిక్ సైన్ లాంగ్వేజి వల్ల ఉపయోగం ఏమిటంటే జపనీస్ పదాలను సైన్ లాంగ్వేజి శాంపిల్ టెక్ట్స్ రూపంలోకి ట్రాన్సలేట్ చేస్తుంది. ఈ ఆటోమేటెడ్ సైన్ లాంగ్వేజి వల్ల సబ్ టైటిట్స్ ఏమేమి ఉంటాయో అవన్ని సైన్ లాంగ్వేజిలోకి రావడం వల్ల ఎవరైతే చిన్నప్పటి నుండి గుడ్డి, మూగ ఉంటారో వారికి చాలా ఈజీగా అర్దం అయ్యే విధంగా ఉంటుంది.

ప్రస్తుతం రూపోందించినటువంటి ఈ టెక్నాలజీలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ, అలాంటి ఇబ్బందులను అధిగమించం కోసం ప్రత్యేకంగా ఓ ఇంటర్‌ఫేస్‌ని యాడ్ చేయడం జరిగింది. అసలు ఈ సైన్ లాంగ్వేజి టెక్నాలజీని రూపోందించడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఎప్పుడైనా న్యూస్‌లో ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని సక్రమంగా అందించడం కోసం దీనిని రూపోందించారు. న్యూస్ ఛానల్స్‌లో బ్రేకింగ్ స్టోరీస్, ఫ్లాష్ న్యూస్ లాంటి సమయాలలో ఈ ఆటోమేటిక్ సైన్ లాంగ్వేజి చాలా ఉపయోగం అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో మీకోసం...

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot