19 సంవత్సరాలను పూర్తి చేసుకున్న 'ఎస్ఎమ్ఎస్'..

27 సంవత్సరాల క్రితం అంటే సరిగ్గా 1984లో ప్రాన్సో - జర్మన్ కార్పోరేషన్‌కి చెందిన హైలీబ్రాండ్ , బెర్నార్డ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఎస్ఎమ్ఎస్‌ని టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. ఎస్ఎమ్ఎస్ టెక్నాలజీని కనిపెట్టిన 8 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి ఎస్ఎమ్ఎస్‌ని 1992లో లండన్‌లో పంపడం జరిగింది. ఐతే ఇప్పడున్న జనరేషన్‌లో మాత్రం మొబైల్ ఫోన్స్‌లలో ఎస్ఎమ్ఎస్‌లే ఎక్కువ పాత్రని పోషిస్తున్నాయి.
2010వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎమ్ఎస్ ద్వారా వచ్చే ఆదాయం $114.6 బిలియన్ డాలర్లు. దీనిని బట్టి మీకు ప్రస్తుత మనిషి జీవన విధానంలో ఎస్ఎమ్ఎస్‌లు ఎంత ముఖ్య పాత్రని పోషిస్తున్నాయో తెలిసిపోతుంది. రాబోయే ఐదు సంవత్సరాలలో ఎస్ఎమ్ఎస్ ద్వారా మొబైల్ నెట్ వర్క్ సంస్దలకు వచ్చే ఆదాయం సుమారుగా గుణిస్తే $726 బిలియన్లని అంచనా.
కాబట్టి మొబైల్ ఫోన్స్ ఉన్న అందరూ కూడా 'ఎస్ఎమ్ఎస్' కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాల్సిన తరుణం వచ్చింది.


Click it and Unblock the Notifications








