కొత్త కొత్త ఫీచర్స్‌తో కళ కళ లాడుతున్న యూట్యూబ్

Posted By: Super

కొత్త కొత్త ఫీచర్స్‌తో కళ కళ లాడుతున్న యూట్యూబ్

బెంగళూరు: ఐదు సంవత్సరాల క్రితం పాపులర్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌ 'యూట్యూబ్' ని సుమారు $1.76 బిలియన్ డాలర్లు పెట్టి సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. కోనుగోలు చేసిన తర్వాత యూట్యూబ్‌లో గూగుల్ చాలా మార్పులు, చేర్పూలు చేసిన విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్‌లో ఓ సరిక్రొత్త ఆఫ్షన్‌ని జత చేయడం జరిగింది.

యూజర్స్‌ని ఎక్కువ మందికి యూట్యూబ్‌పై ఆసక్తి కనబర్చేందుకు గాను, కొత్తగా టివి ఛానల్స్‌ని అనుసంధానంగా పనిచేసే ఫీచర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. దీని ద్వారా యూజర్స్ కేబుల్ టివి మాదిరి యూట్యూబ్‌ని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా యాడ్స్‌లో డబ్బుని సంపాదించే భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టినట్లు గూగుల్ తెలిపింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూట్యూబ్‌ డిస్ ప్లే విధానమే మారనుంది. యూట్యూబ్ డిస్ ప్లే మూడు కాలమ్స్ మాదిరి కనిపిస్తుంది. ఎడమ వైపునున్న కాలమ్‌లో యూజర్స్ వారికి కావాల్సిన, నచ్చిన ఫేవరేట్ వీడియోలను, ఛానల్స్‌ను చూస్తుండడమే కాకుండా, నచ్చిన వీడియోలను స్నేహితులకు ఫేస్‌బుక్, సోషల్ నెట్ వర్కింగ్ ద్వారా పోస్ట్ చేయవచ్చు. ఇది ఇలా ఉంటే ఇటీవలే యూట్యూబ్ తన యొక్క ఆన్ లైన్ మూవీలను అద్దెకు ఇచ్చే సర్వీసుని జపాన్‌కు విస్తరించిన సంగతి తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot