Home
News

ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్ ఆఫర్! ఆఫర్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు 

By Maheswara

ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ Tecno తన టెక్నో కెమోన్ 20 ప్రో 5G స్మార్ట్ ఫోన్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. మీడియా టెక్ డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్ తో కూడిన Tecno Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్ గత నెలలో భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఇప్పుడు, షెన్‌జెన్ హెడ్‌క్వార్టర్డ్ బ్రాండ్ అమెజాన్ ద్వారా దేశంలో ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ను తగ్గింపు రేటుతో అందిస్తోంది.

Tecno Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ ధర రూ. 19,999 గా ఉంది. ప్రస్తుతం, తాజా బ్యాంక్ ఆఫర్‌లతో, ఈ ఫోన్ కొంచెం మెరుగైన ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు చెల్లింపు ఆధారిత తగ్గింపులు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది మరియు 33W వైర్డ్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Tecno Camon 20 Pro 5G Gets Huge Offer Of Rs.2000 Instant Discount. Offer Price And Specifications Details.

అమెజాన్ లో ఈ టెక్నో కెమోన్ 20 ప్రో 5G యొక్క బేస్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ.19,999 కి లిస్ట్ చేయబడింది. అలాగే, మరో వేరియంట్, 12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 21,999 గా పొందుపరిచారు. టెక్నో సంస్థ, బుధవారం ఒక పత్రికా ప్రకటన ద్వారా, రూ. 2,000 తక్షణ తగ్గింపు ని ప్రకటించింది. ఈ ఆఫర్ అన్ని బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు వర్తిస్తుంది. దీనితో వినియోగ దారులు ఈ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ ను ధర రూ. 17,999 మరియు 12GB RAM వేరియంట్ ను రూ. 19,999 కి పొందవచ్చు.

Tecno Camon 20 Pro 5G స్మార్ట్ ఫోన్ పై ఈ తగ్గింపు ఆఫర్ జూన్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. అదనంగా, బండిల్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో ధర రూ. 18,999. ఇంకా, నో-కాస్ట్ EMI ఎంపికలు రూ.1,667 నుండి ప్రారంభమవుతాయి. అయితే, ఈ తాజా తగ్గింపు ఆఫర్ ఇంకా ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో పొందుపరచలేదు. త్వరలోనే అప్డేట్ అవుతుందని ఆశిద్దాం.

Tecno Camon 20 Pro 5G స్పెసిఫికేషన్ల వివరాలు
టెక్నో కెమోన్ 20 ప్రో 5G ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 13.0 తో పనిచేస్తుంది. మరియు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల పూర్తి HD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 8GB RAMతో పాటు 6nm మీడియా టెక్ డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ RGBW ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ని ప్యాక్ చేస్తుంది. ఇది బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌తో అమర్చబడింది. ఈ హ్యాండ్‌సెట్ 33W వైర్డ్ ఛార్జింగ్‌ టెక్నాలజీ తో 5,000mAh బ్యాటరీకలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Tecno Camon 20 Pro 5G Gets Huge Offer Of Rs.2000 Instant Discount. Offer Price And Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X