రూ.6499 కే డ్యూయల్ కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఐఫోన్ తరహా ఫీచర్..!
టెక్నో పాప్ 8 స్మార్ట్‌ఫోన్ (Tecno Pop 8) భారత్‌లో విడుదల అయింది. ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2023లోనే ఆవిష్కరించారు. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ Unisoc చిప్‌సెట్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఎంట్రీ లెవల్ వేరియంట్ ఒకే ర్యామ్, అంతర్గత స్టోరేజీతో అందుబాటులోకి రానుంది.
టెక్నో పాప్ 8 స్మార్ట్‌ఫోన్ ధర : టెక్నో పాప్ 8 స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్, 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి వస్తుంది. ఈ మోడల్ ధర రూ.6499గా ఉంది. జనవరి 9 మధ్యాహ్నం 12 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ప్రారంభ ఆఫర్ కింద బ్యాంకు ఆఫర్లతో కలిగి బేస్ వేరియంట్ రూ.5999 కే లభిస్తుంది. లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మాత్రమేనని సంస్థ తెలిపింది.

టెక్నో పాప్ 8 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల HD+ డాట్ ఇన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1612*720 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీప్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. ఆపిల్ ఫోన్ తరహాలోని డైనమిక్ పోర్టు ఫీచర్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రక్షణకు పండా గ్లాస్‌తో వస్తుంది.
ఈ టెక్నో పాప్ 8 హ్యాండ్‌సెట్ Unisoc T606 SoC చిప్‌తో వస్తుంది. 4GB LPDDR4X ర్యామ్ మరియు 64GB UFS 2.2 అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. ర్యామ్‌ను 8GB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. అలాగే మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీ 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 Go ఎడిషన్ ఆధారిత HiOS 13 ఆధారంగా పనిచేస్తుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 12MP ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్ LED ఫ్లాష్ యూనిట్‌తో వస్తుంది. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ముందువైపు కూడా డ్యూయల్ LED మైక్రో స్లిట్ ఫ్లాష్‌లైట్‌తో వస్తుంది.
ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ DTS స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో ఉన్న మిగిలిన స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే 400 శాతం అధికమైన సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 10W వైర్ ఛార్జర్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్ రంగుల్లో లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా టెక్నో పాప్ 8 హ్యాండ్‌సెట్ డ్యూయల్ నానో సిమ్‌కార్డును సపోర్టు చేస్తుంది. 4G VoLTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.0, GPS మరియు USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IPX2 రేటింగ్‌తో కూడిన స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








