Home
News

7000mAh పెద్ద బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!! ధర కూడా తక్కువే....

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ నేడు భారతదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మాలి G52 GPU తో జతచేయబడి MediaTek Helio G85 SoC ద్వారా శక్తిని పొందుతుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండడమే కాకుండా సెల్ఫీ కెమెరాను డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్‌తో మరియు 2K వీడియో రికార్డింగ్‌ మద్దతుతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్ ఆఫర్స్

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ ధరలు & సేల్ ఆఫర్స్

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ యొక్క ధర రూ.10,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ యొక్క ధర రూ.12,999. ఇది ఆగస్టు 5 న ప్రత్యేకంగా అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ మోడల్స్ లాంచ్ ఆఫర్లలో భాగంగా పరిమిత కాల వ్యవధిలో వరుసగా రూ.10,499 మరియు రూ.12,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. టెక్నో సంస్థ ఈ స్మార్ట్ ఫోన్‌ను డాజిల్ బ్లాక్, ఎనర్జీ బ్లూ మరియు పోలార్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది.

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

టెక్నో పోవా 2 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత HiOS లో రన్ అవుతుంది. ఇది 6.95-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,460 పిక్సెల్స్ రేషియో, 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 386 PP పిక్సెల్ డెన్సిటీ, 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 180HZ టచ్ శాంప్లింగ్ రేట్‌ని కలిగి ఉంది. అలాగే హుడ్ కింద ఇది మీడియాటెక్ హీలియో G85 SoC మరియు మాలి G52 GPU, 6GB వరకు ర్యామ్, మరియు 128GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కంపెనీ అంతర్నిర్మిత 'హైపర్‌ఇంగైన్ గేమ్ టెక్నాలజీ'ని కలిగి ఉంది. ఇది టెక్నో పోవా 2 "హై-ఎండ్ గ్రాఫిక్ క్రంచింగ్‌ను ఇస్తుందని పేర్కొంది, ఇది భారీ గేమింగ్‌కు కూడా సరిపోతుంది."

ఆప్టిక్స్

ఆప్టిక్స్ విషయానికి వస్తే టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో AI క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.79 ఎపర్చర్ లెన్స్ & AI ప్రైమరీ సెన్సార్‌తో 48-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు అమర్చబడి ఉంటాయి. ఈ సెటప్‌లో క్వాడ్-ఎల్ఈడి ఫ్లాష్ కూడా ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా సెన్సార్ ను కలిగి ఉంది. ఇది పంచ్-హోల్ కటౌట్‌లో ఉండి 2K వీడియో రికార్డింగ్ మరియు 2x జూమ్ ఫీచర్లను కలిగి ఉంది.

టెక్నో పోవా 2

టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 4G LTE, Wi-Fi, Bluetooth, USB Type-C, USB OTG మరియు మరిన్నిటిని కలిగి ఉన్నాయి. టెక్నో పోవా 2 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది. ఇది గేమ్ స్పేస్ 2.0, గేమ్ వాయిస్ ఛేంజర్ మరియు సిస్టమ్ టర్బో 2.0 లను కూడా స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్‌కి సహాయం చేస్తుంది. ఫోన్ 18W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌కు 46 రోజుల స్టాండ్‌బై సమయం, 233 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ లేదా 49 గంటల కాలింగ్ సమయం ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Pova 2 Smartphone Released in India With 7,000mAh Battery: Price, Specs, Amazon Sale Launch Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X