7,000 mAh భారీ బ్యాటరీతో టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ టీజర్!! లాంచ్ త్వరలోనే
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ యొక్క కొత్త ఫోన్ లను విడుదల చేయడానికి ముందు వాటి యొక్క టీజర్ లను విడుదల చేయడం అనేది కొత్త కాదు. చైనా యొక్క స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థల బాటలోనే టెక్నో సంస్థ కూడా తన యొక్క కొత్త ఫోన్ టెక్నో పోవా 2 కు సంబందించిన కొత్త టీజర్లను విడుదల చేసింది. Tecno సంస్థ త్వరలోనే ఈ కొత్త స్మార్ట్ఫోన్ను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త టీజర్ లోని సమాచారం ప్రకారం రాబోయే కొత్త ఫోన్ 7,000 mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తున్నట్లు నిర్ధారించింది. ఈ టీజర్ యొక్క మరింత సమాచారం తెలుసుకొవడానికి ముందుకు చదవండి.

టెక్నో పోవా 2 స్పెసిఫికేషన్స్
టెక్నో స్మార్ట్ ఫోన్ కంపెనీ కొత్తగా విడుదల చేసిన టీజర్ యొక్క వివరాల లోకి వెళ్తే స్మార్ట్ ఫోన్ కు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయితే ఇది ఫిలిప్పీన్స్లో ప్రారంభించినందున ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాలను కింద వాటిని ఆశించవచ్చు. Tecno Pova 2 ఫోన్ 6.9-అంగుళాల FHD + LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది మాలి G52 GPU తో పాటు శక్తివంతమైన PETITEK HELIO G85 చిప్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇది 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇందులో గల మెమరీ కార్డు స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు.

టెక్నో పోవా 2 ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్- కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది అని భావిస్తున్నారు. ఇందులో 48 MP కెమెరాతో ప్రాథమిక సెన్సర్, 2 MP మాక్రో కెమెరా, ఒక 2 MP డీప్ సెన్సార్ మరియు 2MP AI లెన్స్ కెమెరాలు కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.

టెక్నో పోవా 2 ఫోన్ 18W పాస్ట్ ఛార్జింగ్ మద్దతును కలిగి ఉండి 7,000mah భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్11 తో రన్ అవుతుంది. ఇతర ఫీచర్లలో Wi-Fi, బ్లూటూత్, GPS, OTG, FM రేడియోలో ఉన్నాయి.

అలాగే ఇది పోలార్ సిల్వర్, డాజిల్ బ్లాక్ మరియు పవర్ బ్లూ వంటి మూడు కలర్ వేరియంట్ లలో అందించబడుతుంది. అయితే ధర విషయానికి వస్తే దీనికి సంబందించి ఎటువంటి ప్రస్తావన లేదు. కానీ అది రియల్ మి 8, Poco M3 ప్రో 5G మరియు Redmi నోట్ 10 ప్రో లతో పాటు 15000 సెగ్మెంట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








