Tecno Pova కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్స్, ధరలు ఎలా ఉన్నాయో చూడండి!!!

|

ఇండియాలో ఇటీవల కాలంలో బడ్జెట్ ధరలో అన్ని సంస్థలు తమ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఇందులో టెక్నో బ్రాండ్ కూడా మిగిలిన వారికి గట్టి పోటీని ఇస్తున్నది. ఈ టెక్నో స్మార్ట్‌ఫోన్ సంస్థ టెక్నో పోవా పేరుతో భారతదేశంలో కొత్తగా మరొక ఫోన్‌ను లాంచ్ చేయనున్నది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబందించిన టీజర్ ను ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేసారు. టీజర్ లోని సమాచారం ప్రకారం ఈ ఫోన్ డిసెంబర్ 4 న భారతదేశంలో లాంచ్ అవుతుందని వెల్లడించింది. టెక్నో యొక్క ఈ పోవా ఫోన్ ఇప్పటికే నైజీరియా మరియు ఫిలిప్పీన్స్‌లోని ఎంపిక చేసిన మార్కెట్లలో అందుబాటులో గల అదే మోడల్ భారత మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

 

టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ ఇండియా ధరల వివరాలు

టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ ఇండియా ధరల వివరాలు

ఫిలిప్పీన్స్‌ యొక్క మార్కెట్లలో టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ యొక్క ధర PHP 6,999 గా ఉంది. ఇండియా యొక్క కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ.10,800 గా ఉంటుంది. టెక్నో సంస్థ తన యొక్క కొత్త ఫోన్ పోవా యొక్క ఇండియా ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రపంచ ధరలతో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇండియాలో ఈ టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ ను మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్ మరియు డాజిల్ బ్లాక్ వంటి మూడు కలర్ ఎంపికలతో ఒకే ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

 

Also Read: Samsung నుంచి కొత్త గేమింగ్ మానిటర్లు! ఈ రోజునుంచి ప్రీ బుకింగ్ మొదలు.Also Read: Samsung నుంచి కొత్త గేమింగ్ మానిటర్లు! ఈ రోజునుంచి ప్రీ బుకింగ్ మొదలు.

టెక్నో పోవా మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్‌ స్పెసిఫికేషన్స్
 

టెక్నో పోవా మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్‌ స్పెసిఫికేషన్స్

టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇది 6.8-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేను 720 × 1,640 పిక్సెల్‌ల పరిమాణం గల స్క్రీన్ రిజల్యూషన్‌తో మరియు సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉన్న పంచ్ హోల్ డిజైన్‌తో కలిగి ఉంటుంది. హార్డ్వేర్ విషయంలో టెక్నో పోవా గ్లోబల్ మోడల్ ఒకే ఒక్క వేరియంట్ 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జత చేయబడి వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్‌తో మరియు ఆండ్రాయిడ్ 10 లోని Hios‌తో రన్ అవుతుంది.

టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ AI హెచ్‌డి లెన్స్ కెమెరా ఫీచర్స్

టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ AI హెచ్‌డి లెన్స్ కెమెరా ఫీచర్స్

టెక్నో పోవా స్మార్ట్‌ఫోన్ యొక్క కెమెరా విభాగానికి వస్తే ఇది వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలు మరియు AI హెచ్‌డి లెన్స్ కెమెరాలు జతచేయబడి ఉన్నాయి. అలాగే ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 6000mAh బ్యాటరీ మద్దతుతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇందులో వై-ఫై, LTE, జిపిఎస్, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Tecno Pova New Smartphone India Launch Date Set on December 4

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X