Home
News

108MP కెమెరాతో కొత్త Tecno ఫోన్ లాంచ్ అయింది! స్పెసిఫికేషన్ల వివరాలు 

టెక్నో సంస్థ Tecno Spark 20 Pro 5G ని స్పార్క్ సిరీస్‌లో సరికొత్తగా జూన్ 17 లాంచ్ చేసారు. ట్రాన్షన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని కంపెనీ ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ను మూడు విభిన్న రంగులు మరియు వేగన్ లెదర్ బ్యాక్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 20 ప్రో 5G 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్‌తో పాటు 8GB RAM తో పనిచేస్తుంది. ఇది 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇంకా,ఈ 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.ఇది 33W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Tecno Spark 20 Pro 5G లభ్యత
టెక్నో స్పార్క్ 20 ప్రో 5G ధర వివరాలు ఇంకా ప్రకటించబడలేదు కానీ రాబోయే రోజుల్లో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా మరియు లాటిన్ అమెరికన్ మార్కెట్‌లలో ఇది అందుబాటులో ఉంటుందని నిర్ధారించబడింది. ఇది గ్లోసీ వైట్, నియాన్ గ్రీన్ మరియు స్టార్‌ట్రైల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది మరియు జూన్ 20 నుండి సౌదీ అరేబియాలో సేల్ చేయబడుతుంది.

Tecno Spark 20 Pro 5G With 108MP Camera

Tecno Spark 20 Pro 5G స్పెసిఫికేషన్ల వివరాలు
టెక్నో స్పార్క్ 20 ప్రో 5G ఆండ్రాయిడ్ 14-ఆధారిత HiOS 14పై పనిచేస్తుంది. మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పూర్తి-HD+ (1,080x2,460 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ముందు స్క్రీన్ కెమెరా కటౌట్ చుట్టూ నోటిఫికేషన్‌లను ప్రదర్శించే డైనమిక్ పోర్ట్ ఫీచర్‌తో వస్తుంది. ఇది హుడ్ కింద మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 8GB RAM మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీతో జత చేయబడింది. టెక్నో యొక్క స్టోరేజీ ఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఆన్‌బోర్డ్ మెమరీని ఉపయోగించని స్టోరేజీ తో 16GB వరకు RAM ని పెంచుకోవచ్చు.

ఇక కెమెరా ఆప్టిక్స్ వివరాలు గమనిస్తే, టెక్నో స్పార్క్ 20 ప్రో 5G 3x ఆప్టికల్ జూమ్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది.

టెక్నో స్పార్క్ 20 ప్రో 5G లోని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.3, GNSS, FM, NFC, Wi-Fi మరియు USB టైప్-సి పోర్ట్ లు ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జి-సెన్సర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో డాల్బీ అట్మోస్-ట్యూన్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి.

ఈ టెక్నో ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో కొత్త స్పార్క్ 20 ప్రో 5Gలో 5000mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. ఇది 168.51x76.21x8.29mm కొలతలు కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Tecno Spark 20 Pro 5G With 108MP Camera,5000mAh Battery And 33W Fast Charging Launched. Specifications Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X