టెక్నో స్పార్క్ 8C బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

చైనా యొక్క ట్రాన్సిషన్ హోల్డింగ్స్ యాజమాన్యంలోని టెక్నో కంపెనీ తాజాగా టెక్నో స్పార్క్ 8C సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను నేడు భారతదేశంలో లాంచ్ చేసారు. టెక్నో బ్రాండ్ యొక్క కొత్త హ్యాండ్‌సెట్ నాలుగు విభిన్న కలర్ ఎంపికలలో వస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డ్యూయల్ రియర్ కెమెరాలలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 90Hz రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లే మరియు 5,000mAh బ్యాటరీలతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ గరిష్టంగా 53 గంటల కాలింగ్ సమయాన్ని మరియు 137 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఈ బ్రాండ్ గత సంవత్సరం లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ 8కి అప్ డేట్ వెర్షన్ గా వచ్చే కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

భారతదేశంలో టెక్నో స్పార్క్ 8C ధర & లభ్యత వివరాలు

భారతదేశంలో టెక్నో స్పార్క్ 8C ధర & లభ్యత వివరాలు

భారతదేశంలో టెక్నో స్పార్క్ 8C స్మార్ట్‌ఫోన్ ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. ఇందులో 3GB ర్యామ్ + 64GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ యొక్క ధర రూ.7,499. కంపెనీ ప్రకారం ఇది లాంచ్ యొక్క ప్రయోగ ధర మాత్రమే. ఈ ధర ఎంతకాలం ఉంటుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. ఈ ఫోన్ డైమండ్ గ్రే, ఐరిస్ పర్పుల్, మాగ్నెట్ బ్లాక్ మరియు టర్కోయిస్ సియాన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఇది ఫిబ్రవరి 24 నుండి అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వెనిలా టెక్నో స్పార్క్ 8 ఫోన్ గత ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో రూ.7,999 ధర వద్ద లాంచ్ అయింది.

ఐఫోన్‌లో ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి PDF ఫైల్‌గా మార్చడం ఎలా?ఐఫోన్‌లో ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి PDF ఫైల్‌గా మార్చడం ఎలా?

టెక్నో స్పార్క్ 8C స్పెసిఫికేషన్స్
 

టెక్నో స్పార్క్ 8C స్పెసిఫికేషన్స్

టెక్నో స్పార్క్ 8C యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై HiOS v7.6తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల HD+ డాట్ నాచ్ డిస్‌ప్లేను 480 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంది. దీని యొక్క డిస్ప్లే 89.3 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 262ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. ఈ ఫోన్ 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ Unisoc T606 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది మెమరీ ఫ్యూజన్ వర్చువల్ RAM ఫీచర్‌తో కూడా వస్తుంది. ఇది తప్పనిసరిగా ఫోన్ యొక్క RAMని 3GB వరకు పెంచి మొత్తం 6GB వరకు తీసుకుంటుంది.

ఆప్టిక్స్

ఆప్టిక్స్ విషయానికి వస్తే కొత్త టెక్నో స్పార్క్ 8C ఫోన్ వెనుక భాగంలో AI- పవర్డ్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్ AI బ్యూటీ 3.0, వైడ్ సెల్ఫీ, పోర్ట్రెయిట్ మోడ్, HDR మరియు ఫిల్టర్‌ల వంటి ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. సెల్ఫీ ఫ్లాష్‌తో ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇతర కెమెరా ఫీచర్లలో 1080p టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ మరియు 120fps స్లో మోషన్ వీడియో రికార్డింగ్ ఉన్నాయి. అలాగే ఇది 64GB eMMC 5.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ (256GB వరకు) ద్వారా విస్తరణకు మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ

టెక్నో స్పార్క్ 8C ఫోన్ లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, FM రేడియో, GPS/ A-GPS మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. అలాగే ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌తో వస్తుంది మరియు వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ స్కానర్ ను కూడా కలిగి ఉంది. అదనంగా ఈ హ్యాండ్‌సెట్ DTS సౌండ్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది HiParty యాప్‌తో పాటు ప్లేబ్యాక్ కోసం మ్యూజిక్ ట్రాక్‌లను అనుకూలీకరించడంలో సహాయపడటానికి SOPlay 2.0 యాప్‌ని కలిగి ఉంటుంది. అదనంగా ఇది IPX2 స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కూడా కలిగి ఉండి 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి 13 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని, 89 రోజుల స్టాండ్‌బై సమయం మరియు గరిష్టంగా 53 గంటల కాలింగ్ సమయాన్ని అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Tecno Spark 8C Budget Smartphone Launched in India With 5,000mAh Battery: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X