టెక్నో స్పార్క్ 8P బడ్జెట్ ధరలో లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో

|

టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ నేడు భారతదేశంలో బడ్జెట్ ధరలో ప్రారంభించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ కూడిన డిస్‌ప్లేను మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఫీచర్లతో లభిస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ ఆధారిత SoC ద్వారా రన్ అవుతూ మెమరీ ఫ్యూజన్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. అదనంగా ఇది 18W ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. టెక్నో బ్రాండ్ దేశంలో ఇప్పటికే విడుదల చేసిన టెక్నో స్పార్క్ 8C, స్పార్క్ గో 2022 మరియు స్పార్క్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో కొత్తగా ఈ హ్యాండ్‌సెట్ ను కూడా చేర్చింది.

 

టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

భారతదేశంలో టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ చేసింది. 4GB RAM + 64GB స్టోరేజ్ ఏకైక మోడల్‌లో లభించే ఈ ఫోన్ రూ.10,999 ధర వద్ద లభిస్తుంది. టెక్నో బ్రాండ్ యొక్క ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ భారతదేశంలోని రిటైల్ స్టోర్లలో అట్లాంటిక్ బ్లూ, ఐరిస్ పర్పుల్, తాహితీ గోల్డ్ మరియు టర్కోయిస్ సియాన్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ గత ఏడాది నవంబర్‌లో ఫిలిప్పీన్స్‌లో 4GB + 128GB కాన్ఫిగరేషన్ మోడల్ PHP 7,499 (దాదాపు రూ. 10,600) ధర ట్యాగ్‌తో ప్రారంభించబడింది.

టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత HiOS 7.6తో రన్ అవుతుంది. అలాగే ఇది 401ppi పిక్సెల్ సాంద్రతతో 6.6-అంగుళాల ఫుల్-HD+ డాట్ డిస్‌ప్లేను 1,080x2,408 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంది. ఫిలిప్పీన్స్‌లో లాంచ్ చేయబడిన మీడియాటెక్ హీలియో G70 SoC మోడల్‌లా కాకుండా భారతీయ వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో G85 SoC ద్వారా రన్ అవుతూ 4GB LPDDR4x RAMతో జత చేయబడి ఉంటుంది. ఇది మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 7GB వరకు ర్యామ్ తో పొడిగించబడుతుంది. వివిధ యాప్‌లను ప్రారంభించే సగటు సమయంలో స్మార్ట్‌ఫోన్ 43 శాతం మెరుగుదలను అందిస్తుందని టెక్నో కంపెనీ పేర్కొంది.

ఆప్టిక్స్

టెక్నో స్పార్క్ 8P స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఫేజ్-డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF)తో f/1.6 అపెర్చర్ లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ను జత చేయబడి వస్తుంది. ఇది 2K టైమ్-లాప్స్, స్లో మోషన్ మరియు వీడియో బోకె షూటింగ్ మోడ్‌ల వంటి ఫీచర్‌లతో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందుభాగంలో డ్యూయల్ LED ఫ్లాష్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. చివరిగా ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేస్తుంది. ఫోన్ IPX2-సర్టిఫైడ్ స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌లో కూడా వస్తుంది. ఇది DTS సరౌండ్ సౌండ్‌తో స్పీకర్‌లను కూడా ప్యాక్ చేస్తుంది.

టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ వివరాలు

టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ వివరాలు

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో ఇండియాలో ఇటీవల టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ గేమింగ్-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ 4GB RAM + 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ మరియు 6GB RAM + 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి రెండు కాన్ఫిగరేషన్ వేరియంట్లలో వరుసగా రూ.11,499 మరియు రూ.13,390 సరసమైన ధరల వద్ద ఎకో బ్లాక్ మరియు టెక్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 7,000mAh అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉండి మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందించడానికి మాలి G52 GPUతో జత చేయబడిన మీడియా టెక్ హీలియో G88 SoCతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ డాట్-ఇన్ డిస్‌ప్లే వంటి అద్బుతమైన ఫీచర్లను కలిగి ఉంది.

 

 

టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్-HD+ డాట్-ఇన్ డిస్‌ప్లేను 1,080x2,460 పిక్సెల్‌ల పరిమాణంలో కలిగి ఉంటుంది. ఇది హుడ్ కింద మాలి G52 GPUతో జతచేయబడి మీడియా టెక్ హీలియో G88 SoCతో రన్ అవుతుంది. ఇది గరిష్టంగా 6GB వరకు RAMని కలిగి ఉంటుంది. అలాగే ఇందులోని మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగించి 11GB వరకు RAM ని విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. టెక్నో పోవా 3 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే పంచ్-హోల్ కటౌట్‌ కేంద్రంగా 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది 14 గంటల వరకు గేమింగ్ సమయాన్ని అందిస్తుంది అని పేర్కొన్నారు. అదనంగా ఇందులోని 33W ఫ్లాష్ ఛార్జర్ 40 నిమిషాలలోనే 50 శాతం వరకు ఛార్జ్‌ బ్యాకప్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Tecno Spark 8P Smartphone Launched in India With MediaTek Helio G85 SoC: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X