7-inch డిస్ప్లే,6000mAh ఫీచర్లతో Tecno Spark Power 2 Air కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్!!!

|

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ స్మార్ట్‌ఫోన్‌ నేడు ఇండియాలో లాంచ్ అయింది. కొన్ని నెలల క్రితం ఇండియాలో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ పవర్ 2 యొక్క ఆప్ డేట్ వెర్షన్ గా విడుదలైన టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ అద్భుతమైన కెమెరా సెటప్, మీడియాటెక్ హెలియో P22 SoC ప్రాసెసర్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ ధరల వివరాలు

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ ధరల వివరాలు

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో నేడు ఒకే ఒక వేరియంట్ లో విడుదల అయింది. 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్‌తో లభించే ఫోన్ యొక్క ధర 8,499 రూపాయలు. ఈ ఫోన్ కాస్మిక్ షైన్ మరియు ఐస్ జాడైట్ వంటి రెండు కలర్ ఎంపికలలో లభిస్తుంది. దీని యొక్క అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 20 మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలుకానున్నాయి.

 

Also Read: 100GB డేటా ప్రయోజనంతో VI కొత్త ప్రీపెయిడ్ ప్లాన్!!!Also Read: 100GB డేటా ప్రయోజనంతో VI కొత్త ప్రీపెయిడ్ ప్లాన్!!!

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ మీడియాటెక్ హెలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్
 

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ మీడియాటెక్ హెలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆదారిత ఎయిర్ HIOS 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 7-అంగుళాల HD + వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లేను 720x1,640 పిక్సెల్ పరిమాణంలో, 20.5: 9 కారక నిష్పత్తితో, 90.6 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో మరియు 480 నిట్స్ ప్రకాశంతో కలిగి ఉంటుంది. ఇది 2GHZ మీడియాటెక్ హెలియో A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పాటు 3 జీబీ ర్యామ్‌ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరిని 256GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది.

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ క్వాడ్ కెమెరా సెటప్‌

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ క్వాడ్ కెమెరా సెటప్‌

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఇమేజింగ్ విషయానికొస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే బోకె మరియు మాక్రో షాట్‌ల కోసం రెండు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను AI లెన్స్ ఫీచర్లతో కలిగి ఉంటుంది. కెమెరా ఫీచర్లలో క్వాడ్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో-సీన్ డిటెక్షన్ మోడ్, బోకె మోడ్, AI హెచ్‌డిఆర్ మోడ్‌లు, AI స్టిక్కర్లు మరియు మాక్రో ఫోటోగ్రఫీ వంటివి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను డ్యూయల్ ఫ్లాష్ సపోర్ట్‌తో కలిగి ఉంది.

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్  6000mAh బ్యాటరీ ఫీచర్స్

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ 6000mAh బ్యాటరీ ఫీచర్స్

టెక్నో స్పార్క్ పవర్ 2 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ 6000mAh అతి పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఇది 560 గంటల వరకు స్టాండ్‌బై సమయం, 38 గంటల వరకు ఫోన్ కాల్ చేయడానికి, 20 గంటల ఇంటర్నెట్ మరియు వై-ఫై సమయం, 151 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ మరియు 13 గంటల సమయం వరకు గేమ్ ప్లేను అందిస్తుంది. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ V5, 4G LTE, వై-ఫై 802.11 b/g/n/ac వంటివి ఉన్నాయి. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ మద్దతును కూడా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Tecno Spark Power 2 Air Smartphone Released in India: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X