ఫేస్‌బుక్‌లో ఆకతాయి చేసిన పనికి టీనేజర్ అమ్మాయి కష్టాలు..

Posted By: Staff

ఫేస్‌బుక్‌లో ఆకతాయి చేసిన పనికి టీనేజర్ అమ్మాయి కష్టాలు..

సిడ్నీ: ప్రపంచంలో కెల్లా అతి తక్కువ కాలంలో ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్‌. ఈ సంవత్సరం ఫేస్‌బుక్‌ సిఇవో మార్క్ జూకర్ బర్గ్ ని టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించిన సంగతి తెలిసిందే. అలాంటి ఫేస్‌బుక్‌‌ ఎకౌంట్ వల్ల చాలా మంది లాభపడిన వారున్నారు అలాగే నష్టపోయిన వారు కూడా ఉన్నారు. లాభపడే వారి మాట అలా ఉంచితే, ఇటీవల కాలంలో ఫేస్‌బుక్‌ వల్ల ఇబ్బందులకు గురి అవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తుంది.

ఈ నేపధ్యంలో ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ నగరంలో ఒక టీనేజ్‌ అమ్మాయి ఫేస్‌ బుక్‌ పేజీని హైజాక్‌ చేసిన మరో టీనేజ్‌ అబ్బాయి ఆ పేజీలో “నాపుట్టిన రోజు పార్టీ మీరంతా రండి" అని ఒక దొంగ ఆహ్వానం ఎక్కించాడు. ఆ ఆహ్వానాన్ని స్వీకరిస్తూ 2 లక్షల సందేశాలు వచ్చాయి. దానితో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కంగారుపడి మా అమ్మాయి సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో ఎవరో ఆమె పేజీని దొంగిలించారని గమనించి లబోదిబో మన్నారు.

ఈ విషయాన్ని వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో చెప్పారు. ఇది మాత్రమే కాకుండా రాబోయే అతిథులను మా ఇంటికి రావద్దని చెప్పడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. దాంతో ఆ తల్లిదండ్రులకి 2 లక్షలమంది అతిథులకు మర్యాదలు చేయాల్సిన బాధ తప్పింది. దాంతో వారు హమ్మయ్యా అనుకున్నారు. చివరికి పోలీసులు ఆ దొంగ ఆహ్వానం పోస్టు చేసిన కుర్రాణ్ణి పట్టుకుని రెండు తగిలించి జరిమానాతో వదిలేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot