ఆన్‌లైన్‌లో యువకుడి ఆత్మహత్య

|

నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ టీనేజర్ ట్విటర్ తరహా చైనా మైక్రోబ్లాగింగ్ సర్వీస్‌లో తన ఆత్మహత్యను ప్రత్యక్ష ప్రసారం చేసాడు. జెంగ్ అనే యువకుడు తన జీవితం పై విరక్తి చెంది ఆన్‌లైన్‌లో అందరూ చూస్తుండగానే ఆత్మహత్యకు తెగబడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఘటనా స్థలానికి చేరుకునే సరికి జెంగ్ అకస్మారక స్థితిలో పడి ఉన్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది.

ఆన్‌లైన్‌లో యువకుడి ఆత్మహత్య

తాను అనుభవిస్తున్న ఒంటరితనాన్ని, మానసిక క్షోభను డజన్ల కొద్ది మైక్రో‌బ్లాగ్‌ల రూపంలో జెన్ తన ఆత్మహత్యకు ముందు పోస్ట్ చేసాడు. తాను ఆత్మహత్య చేసుకోవడం కోసం హిప్నోటిక్ మందులు, టేపులు ఇంకా బొగ్గును సమకూర్చుకున్నట్లు జెంగ్ తన పోస్ట్‌లలో పేర్కొన్నాడు. తాను సేవించిన మందులు ప్రభావం చూపటం ప్రారంభించాయని, శక్తిని కోల్పోతున్నానని మరికొద్ది సేపట్లో మరణిస్తానని జెంగ్ తన మైక్రోబ్లాగ్‌లో పేర్కొన్నాడు.

జెన్ ఆన్‌లైన్‌లో ఓ అమ్మాయితో ప్రేమ పడ్డానని తనతో చెప్పాడని అయితే ఆ అమ్మాయి జెన్‌ను ప్రేమిస్తుందో లేదో తెలియదని జెన్ నాయినమ్మ దర్యాప్తులో భాగంగా పోలీసులకు వివరించింది. జెంగ్‌కు రెండు సంవత్సరాల వయసున్నప్పుడే అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాతి అతని తల్లి మరొక వివాహం చేసుకోవటంతో జెన్ తన నాయినమ్మ వద్దే ఉంటున్నాడు. ఆన్‌లైన్‌లో 4 గంటల పాటు సాగిన జెన్ ఆత్మహత్య తతంగంలో భాగంగా అతన్ని కాపాడేందుకు చాలా మంది ప్రయత్నించినప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Teen commits live online suicide in China. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X