ఐఫోన్ కోసం బాలుడి హత్య!

Posted By:

ఐఫోన్ కోసం బాలుడి హత్య!

ఓ కుర్రవాడు తన జల్సాల కోసం తన పొరిగింట్లో ఉంటోన్న 6 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసి కొద్ది గంటల్లోనే అత్యంత కిరాతకంగా హత్య చేసాడు. ఈ దారుణమైన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సెంట్రల్ ఢిల్లీలోని రంజిత్ నగర్ కు చెందిన పండ్ల వ్యాపారి కుమారుడు గణేష్ (6) గురువారం తన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మీ పిల్లవాడ్ని కిడ్నాప్ చేసామని, రూ.1.5 లక్షల ఇస్తే అతడిని విడుదల చేస్తామని డిమాండ్ చేస్తూ అదే రోజు రాత్రి గణేష్ తండ్రికి ఫోన్ కాల్ రావటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు శుక్రవారం నైరుతి ఢిల్లీలోని ఓ పార్క్ లో గణేష్ మృతదేహం లభించింది. హత్యకు గురైన బాలుడు చివరిసారిగా ఎవరితో ఉన్నాడనే కోణంలో పోలీసులు ఆరా తీయగా వ్యాపరీ ఇంటి సమీపంలో ఉంటున్న 17 సంవత్సరాల యువకుడిలో బాలుడు ఆడినట్లు తేలింది. దీంతో ఆ యువకుడిని ఖాకీలు తమదైన శైలిలో ప్రశ్నించగా, ఐఫోన్ కోసమే బాలుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Teen kidnaps a kid and killed to fund iPhone. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot