సోషల్ మీడియా దుర్వినియోగం.. పెరుగుతున్న సైబర్ నేరాలు!

Posted By:

యూఎస్ ఇంకా కెనడా ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు ఆత్మహత్యా ఉదంతాలు సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆయోమయంలోకి నెట్టాయి. తమను ఫేస్‌బుక్‌లో వేధించటాన్ని సహించలేకపోయిన ఇద్దరు యుక్త వయసు అమ్మయహలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో యువత పట్ల పెరుగుతున్న వేధింపులు సామాజిక సంబంధాల విలువలను నాశనం చేస్తున్నాయి.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ మనందరి జీవితాల్లో ఒక భాగమైపోయిన విషయం తెలిసిందే. సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం మరింతగా విస్తరించిన నేపధ్యంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. డేటా అపహరణ.. చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరపరమైన అంశాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హెచ్చుమీరుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న పలు విలక్షణమైన నేరాలును మీకు వివరించటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియా దుర్వినియోగం.. పెరుగుతున్న సైబర్ నేరాలు!

ఫేస్‌బుక్ ద్వారా వేధించారు ప్రాణం తీసుకుంది: ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన ఫోబ్‌ప్రిన్స్ 2010 సహచర విద్యార్థుల ఫేస్‌బుక్‌లో చేస్తున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక ఉరిపోసుకుని చనిపోయింది. ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.

 

సోషల్ మీడియా దుర్వినియోగం.. పెరుగుతున్న సైబర్ నేరాలు!

మాజీ భర్త జాతకాన్నే మార్చేసింది: నైజీరియాకు చెందిన ఓ 23 ఏళ్ల యువతి తన మాజీ భర్తను నైజీరియాకు చెందిన ఉగ్రవాదిగా అభిర్ణిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దింతో సదురు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

 

సోషల్ మీడియా దుర్వినియోగం.. పెరుగుతున్న సైబర్ నేరాలు!

భలే దొంగ: మనకు ఇష్టమైనదే ఒకోసారి కొంపముంచుతుంది. జోనాథన్ జి.పార్కర్ అనే నేరస్థుడు, తాను నేరానికి పాల్పిన ఇంట్లోని వ్యక్తికి సంబంధించిన కంప్యూటర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగినై, లాగ్ అవుట్ చేయటం మర్చిపోయాడు. పోలీసులకు ఇదే పెద్ద ఆధారమై సదరు నేరస్థుడిని పట్టించింది.

 

సోషల్ మీడియా దుర్వినియోగం.. పెరుగుతున్న సైబర్ నేరాలు!

భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినందుకు జైలు పాలు: 2007లో డైలాన్ ఒస్బోర్న్ అనే వ్యక్తి భార్య పై వేధింపులకు పాల్పడిన నేపధ్యంలో మేజిస్ట్రేట్ అతనిని మందలించి ఆమెతో మాట్లాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో డైలాన్ ఒస్బోర్న్ యాధృచికంగా తన భార్యకు ‘ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్' పెట్టాడు. ఈ చర్యకు భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించటంతో డైలాన్ ఒస్బోర్న్‌ను 10 రోజులు జైల్లో ఉంచారు.

 

సోషల్ మీడియా దుర్వినియోగం.. పెరుగుతున్న సైబర్ నేరాలు!

జంతువులను హింసిస్తూ: అమెరికాకు చెందిన వనీసా స్టార్ ఇంకా అలెగ్జాండర్ డేనియల్ దంపతులు జంతు సంరక్షణా చట్టాన్ని ఉల్లంగిస్తూ జంతువులను హింసించిన దృశ్యాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుగు గాను జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting