ఐఫోన్ కోసం డ్రైనేజీలో ఇరుక్కుపోయిన యువతి!

Posted By:

డోవర్, కెంట్ ప్రాంతానికి చెందిన 16 సంవత్సరాల యువతి డ్రైనేజీలో పడిన తన ఐఫోన్‌ను వెలికితీసే ప్రయత్నంలో ఆ ఇరుకు డ్రైనేజీ గుంతలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించినట్లయితే....

ఐఫోన్ కోసం డ్రైనేజీలో ఇరుక్కుపోయిన యువతి!

స్థానికురాలైన ఎల్లా బిర్చీనఫ్ (16) తన ఇంటి సమీపంలోని డ్రైనేజీ గుంతలో అనుకోకుండా తన ఐఫోన్ ను జారవిడిచింది. గల్లంతైన తన ఐఫోన్‌ను కాళ్లతో అందిపుచ్చుకునే ఉద్దేశ్యంతో ఎల్లా డ్రెయినేజీ పై ఉన్న ఇనుపు మూతను తొలగించి చేతుల సపోర్ట్‌తో డ్రెయిన్‌లోకి దిగింది.

అయితే ఆ ప్రాంతం ఇరుకుగా ఉండటంతో ఆమె డ్రెయిన్‌లో ఇరుక్కుపోవల్సి వచ్చింది. వెంటనే కెంట్ ఫైర్ అండ్ రిస్క్యూ సర్వీసుకు సమాచారాన్ని అందించటంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది బాధితురాలను సురక్షితంగా బయటకు లాగారు.

ఐఫోన్ కోసం డ్రైనేజీలో ఇరుక్కుపోయిన యువతి!

అదృష్టవశాత్తూ ఎల్లాకు ఎటువంటి గాయాలు కాలేదని ఫైర్ సిబ్బంది ఒకరు తెలిపారు. ఈ ఘటనను సమీపం నుంచి చిత్రీకరించిన ఒకరు సదరు దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతో వాటికి ప్రాధాన్యత సంతరించుకుంది. డ్రైనేజీలో పడిపోయిన ఐఫోన్ పూర్తిగా నీటిచమ్మకు లోనైనట్లు బాధితురాలు స్నేహితురాలు ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot