చౌకైన ఐఫోన్ కొనడానికి ప్రయత్నించి ఏమి కొన్నాడో తెలుసా?

|

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసిన ప్రజలకు కొన్ని సార్లు నకిలీ ఐఫోన్‌లు లేదా సబ్బు బార్‌లతో ప్యాక్ చేసిన బాక్సులను స్వీకరించినట్లు చాలా సందర్భాలలో విన్నారు. అయితే ఇటువంటి సంఘటన థాయ్‌లాండ్‌లో ఒకటి జరిగింది. కానీ కొద్దిగా బిన్నంగా వినూత్నంగా జరిగింది. వివరాలలోకి వస్తే థాయ్ టీన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ లో ఐఫోన్‌ను ఆర్డర్ చేస్తే అతను అందుకున్న పెద్ద ప్యాకేజీని చూసి షాక్‌కు గురయ్యాడు. కారణం స్మార్ట్‌ఫోన్‌ల స్క్రీన్ పరిమాణాలు పెరుగుతున్నాయి కానీ ఇంత పెద్ద పరిమాణం గల ప్యాక్ అందుకొని నిజంగానే షాక్ అయ్యాడు. తరువాత ఈ టీనేజర్ చేసిన అతి పెద్ద తప్పు ఏమిటో తెలుసుకున్నాడు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం

ఓరియంటల్ డైలీ మలేషియా ప్రకారం థాయ్‌లాండ్‌కు చెందిన ఒక టీనేజ్ యువకుడు మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకు ఐఫోన్‌ను విక్రయించే ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంను చూసి చాలా ఉత్సాహపడ్డాడు. అతని ఉత్సహం ఎంతలా అంటే వివరాలను క్రాస్ చెక్ చేయకుండా మరియు వివరణ చదవకుండా అతను "కొనండి" బటన్‌ను నొక్కి తన ఐఫోన్ ప్యాక్ వచ్చే వరకు ఆత్రంగా ఎదురు చూశాడు. అతను ప్యాకేజీని అందుకున్నాక తెలిసింది అతను నిజంగా ఒక ఐఫోన్‌ను అందుకున్నాడని గ్రహించాడు కాని అతను కోరుకున్నది కాదు అని. టీనేజర్ అందుకున్న ప్యాకేజీ అతనిలాగే చాలా పెద్దదిగా ఉండడంతో షాక్ అయ్యాడు. తరువాత ఓపెన్ చేసి చూడగా అది ఐఫోన్ ఆకారంలో ఉన్న కాఫీ టేబుల్‌ అని తెలుసుకుని వెబ్ సైట్ లోని సమాచారం తెలుసుకొని తాను చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసుకున్నాడు. ఈ సారి అతను ఆర్డర్ చేసిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం తప్పు ఏమాత్రం కాదు. వెబ్ సైట్ తెలిపిన ఉత్పత్తి వివరాలను చదవడంలో టీనేజర్ పూర్తిగా విఫలమయ్యాడు.

ఐఫోన్ 6S కాఫీ టేబుల్
 

ఐఫోన్ 6S కాఫీ టేబుల్

టీనేజర్ తెలిపిన వివరాల ప్రకారం తాను గమనించిన వెబ్ సైట్ లో ఐఫోన్ మార్కెట్ ధర కంటే చాలా తక్కువకు వస్తున్నది అని భావించి ఈ విధమైన ఒప్పందాన్ని వీడకూడదని ఆర్డర్‌తో ముందుకు సాగనని తెలిపాడు. అలాగే బ్రహ్మాండమైన ఐఫోన్‌ ఫోటోలు కూడా ఎక్కువ ఆశక్తిని చూపేలా చేసాయి. సోషల్ మీడియాలో దీనిని పోస్ట్ చేసి కొనుగోలు చేసినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కాఫీ టేబుల్ ఐఫోన్ 6S లాగా కనిపించడం. కాకపోతే పరిమాణంలో పెద్దదిగా ఉంది. ఇది నలుపు రంగులో ఉన్న స్క్రీన్, టచ్-ఐడి మరియు నకిలీ మైక్ కలిగి ఉంది. ప్రసిద్ధ రోజ్ గోల్డ్ కలర్‌లో మరియు తెలుపు రంగులో నాలుగు కాళ్ల టేబుల్ ను చూడవచ్చు.

నకిలీ ఐఫోన్‌

ఐఫోన్ 6S కాఫీ టేబుల్ నకిలీ ఐఫోన్‌ల కంటే చాలా బాగుంది. ఐఫోన్‌కు బదులుగా డిటర్జెంట్ సబ్బులతో ప్యాక్ చేసి డెలివరీలను కొన్నిసార్లు కొంతమంది అందుకున్నారు. 2019 లో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి రూ.93,000 విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ చేసినప్పటికీ కెమెరా స్టిక్కర్‌లతో కూడిన నకిలీ ఫోన్‌ను అందుకున్నాడు. ఇది చూడడానికి ఐఫోన్ XS కు సమానంగా ఉంటుంది కాని Android లో నడుస్తుంది. తరువాత ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం అతని ఆర్డర్‌ను భర్తీ చేసి అసలు ఐఫోన్‌ను పంపిణీ చేసింది.

Best Mobiles in India

English summary
Teenager Bought Coffee Table While Trying to Buy The Cheapest iPhone Through Online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X